Telangana Corona Virus: తెలంగాణలో రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ కట్టడి కోసం తెలంగాణ సర్కార్ అలెర్ట్ అయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలతో పాటు.. రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలలో కూడా పక్క రాష్ట్రాల మధ్య నైట్ కర్ఫ్యూ తో పాటు..కరోనా వ్యాప్తిని నివారించడానికి పలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీంతో తెలంగాణలో కూడా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి నైట్ కర్ఫ్యూ పెట్టొచ్చని అంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పెరుగుతున్న కరోన కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. పెరుగుతున్న కేసులు, వసతులు, మెడిసిన్ పై చర్చిస్తూ.. తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కరోనా ఆంక్షలను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఓ వైపు పెరుగుతున్న కేసులు.. మరోవైపు సంక్రాంతి పండగ దృష్ట్యా .. పరిస్థితి ఇలా కొనసాగుతుంటే.. ఆంక్షలను మరింత కఠిన తరం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పండగ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు అధికంగా ఉంటాయని భావించిన అధికారులు ఇప్పటికే రాష్ట్ర సరిహద్దుల్లో కరోన పరీక్షలను నిర్వహించడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతోన్న కోవిడ్ ఆంక్షల ప్రకారం.. రాష్ట్రంలో ఎక్కడా కూడా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. ప్రజలు ఒకే చోట గుంపులుగా ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఇప్పటికే విద్యాసంస్థలకు ఈనెల 16 వరకూ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే..
రాష్ట్రంలో గత24 గంటల్లో 1825 మందికి వైరస్ పాజిటివ్ గా. 70,697 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ కొత్త కేసులలో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధి నుంచే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1042 కేసులు వెలుగుచూశాయి. నిన్బ్న రాష్ట్ర వ్యాప్తంగా బుస్టర్ డోసు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రంట్ లైన్ వారియర్స్ తో పాటు, వృద్దులకు కూడా బూస్టర్ డోసు ఇస్తున్నారు.
Also Read: ఈ మూడు రకాల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడతారంటున్న చాణక్య..