Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తునే ఉంది. గడిచిన 24 గంటల్లో 77,930 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,754 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. మరోవైపు కోవిడ్‌తో చికిత్స పొందుతూ మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యా్ప్తంగా మరణించిన వారి సంఖ్య 2,312 కు చేరుకుంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, కరోనా బారి నుంచి తాజాగా 6,542 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,62,160కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక, శుక్రవారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,507 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి….
Read Also…. India Coronavirus: భారత్‌లో కరోనా అల్లకల్లోలం.. ప్రపంచంలో తొలిసారిగా.. 4 లక్షలకు పైగా కేసులు..