Y S Sharmila: వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఎవరేమన్నారంటే..

|

Feb 09, 2021 | 5:11 PM

Y S Sharmila New Party: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో కొత్త..

Y S Sharmila: వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఎవరేమన్నారంటే..
Follow us on

Y S Sharmila New Party: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటుకై ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ ఏర్పాటులో భాగంగా తొలి అడుగు వేసిన ఆమె.. ఇవాళ పలు జిల్లాల నేతలతో మాట్లాడారు. కాగా, తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. షర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించిన షబ్బీర్ అలీ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు. చివరగా తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇదే అంశంపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలిగిందన్నారు. వైఎస్ వారసులు ఆయన కుటుంబ సభ్యులు కాదని వ్యాఖ్యానించిన షబ్బీర్ అలీ.. కాంగ్రెస్ కార్యకర్తలే వైఎస్ఆర్ నిజమైన వారసులు అని పేర్కొన్నారు. వైఎస్ఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ’కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. షర్మిల పార్టీ కూడా అంతే’ అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు సీతక్క కూడా షర్మిల పార్టీపై స్పందించారు. షర్మిల పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతున్నారని విమర్శించారు. ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును దుర్వినియోగం చేయవద్దని సీతక్క హితవుచెప్పారు. షర్మిల పార్టీ స్థాపన వెనుక ఇతర శక్తులు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వైఎస్ఆర్ ఎదిగారన్న సీతక్క.. పార్టీ, వైఎస్ఆర్ వేరు వేరు కాదని వ్యాఖ్యానించారు.

Also read:

Kajal Agarwal: తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!

Gold Prices Today Fall: ఆల్ టైం హై నుంచి దిగి వస్తున్న పసిడి ధరలు.. గత 6 రోజుల్లో 5వ సారి రికార్డ్ స్థాయిలో ఎన్ని వేలు తగ్గిందో తెలుసా..!