Telangana: కాంగ్రెస్‌లో కొత్తగా 2 పంచాయితీలు.. ఇలా అయితే కష్టమే అంటున్న క్యాడర్.. కలిసి సాగేదెప్పుడు?

|

Nov 20, 2022 | 7:25 PM

కాంగ్రెస్‌లో అంతే..! ఇష్యూ ఏదైనా రచ్చ కామన్.! ఇప్పటికే సీనియర్లు సలసల మంటున్నారు..! రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు మర్రిశశిధర్‌రెడ్డిపై వేటు విషయంలోనూ విబేధాలు బయటపడుతున్నాయి..!

Telangana: కాంగ్రెస్‌లో కొత్తగా 2 పంచాయితీలు.. ఇలా అయితే కష్టమే అంటున్న క్యాడర్.. కలిసి సాగేదెప్పుడు?
Telangana Congress
Follow us on

కాంగ్రెస్ అంటేనే కలహాలు. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ రూటే సపరేటు. ఏదైనా నిర్ణయం తీసుకున్నా లొల్లే.! తీసుకోకపోయినా లొల్లే..! మర్రిశశిధర్‌రెడ్డి సస్పెండ్‌ విషయంలోనూ ఇదే తరహా పంచాయితీ నడుస్తోంది..! అమిత్‌షాను కలిశారు. పార్టీమార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అందుకే మర్రిపై వేటు వేసింది క్రమశిక్షణ కమిటీ..! 6 ఏళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక్కడే మొదలైంది వివాదం. అసలు చిన్నారెడ్డి ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని క్రమశిక్షణ కమిటీ మెంబర్లే నిలదీస్తున్నారు.

అయితే క్రమశిక్షణ కమిటీ వివరణ మాత్రం మరోలా ఉంది.. మర్రి శశిధర్ రెడ్డిపై వేటు అనేది ఏకపక్షం కాదని.. అందరితో చర్చించాక.. సమష్టిగానే డెసిషన్‌ తీసుకున్నామని చెబుతోంది. అమిత్‌షాను కలిశాక.. BJPలోకి వెళ్తున్నట్లు సంకేతాలు ఇచ్చాక… కాంగ్రెస్‌కు క్యాన్సర్‌ సోకిందంటూ ఘాటు విమర్శలు చేశాక.. ఇంకా షోకాజ్‌ నోటీసు ఎందుకన్నది క్రమశిక్షణ కమిటీ ప్రశ్న..!

ఇక శనివారంపై జరిగిన జూమ్‌ మీటింగ్‌పై మరో రచ్చ.! కొన్ని కీలక అంశాలు చర్చించేందుకు…టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి నేతృత్వంలో శనివారం సమావేశం నిర్వహించారు. మొత్తం 13 మంది అధికార ప్రతినిధులందరికీ ముందే సమాచారం ఇచ్చారు..! కానీ ఏకంగా 11 మంది గైర్హాజరయ్యారు…! ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకుంది PCC. మీటింగ్‌పై ముందే చెప్పినా…ఎందుకు రాలేదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది. సరైన సమధానం చెప్పకపోతే… చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం కంటిన్యూ అవుతోంది..వలసలు కూడా పెరిగిపోతున్నాయి..! మరి హైకమాండ్ ఫోకస్‌ పెడుతుందా? పక్కచూపులు చూస్తున్న నేతలకు ఎలాంటి భరోసా ఇస్తుందన్నది ఆసక్తికరం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..