Telangana: రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి.. మిగతావి ఎవరికంటే..?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి పేర్లను కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఫైనల్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించారు.

Telangana: రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి.. మిగతావి ఎవరికంటే..?
Telangana Congress

Updated on: Mar 09, 2025 | 7:00 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో MLC సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. సీపీఐకి ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ లెక్కన మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతోంది. ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో ఇప్పటికే KC వేణుగోపాల్ చర్చించారు. టీపీసీసీ అందజేసిన మెరిట్ రిపోర్ట్‌పై ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడారు ఖర్గే, కేసీ. ఆపై ఫైనల్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. అద్దంకి దయాకర్, శంకర నాయక్, విజయశాంతిల పేర్లను ఖరారు చేసింది ఏఐసీసీ. ఒక స్థానాన్ని  సీపీఐకి కేటాయించింది.

 

ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. సామాజిక సమీకరణాలను లెక్కలో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నాయి. అయితే విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌ను అదృష్టం వరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..