Telangana: బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?

తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదవుతుంగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ తీవ్ర మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి రానున్న మూడు రోజుల్లో, గడిచిన కొన్ని రోజుల్లో రాష్టరంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Telangana: బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Telangana Weather Report

Updated on: Dec 23, 2025 | 11:15 AM

చలికాలం ప్రారంభమై కొన్ని రోజులుకూడా కాలేదు. అప్పుడే తెలంగాణలో చలి తీవ్ర పెరిగిపోయింది. రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాతాంల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై సింగిల్‌ డిజిట్‌కు పడిపోగా.. రానున్న రెండు మూడు రోజుల్లో ఇది మరింత తగ్గనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ

పెరుగుతున్న చలి తీవ్ర, దట్టమైన పొగమంచు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ఆయా జిల్లాలో రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ఉత్తర తెలంగాణ పశ్చిమ, మధ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హేచ్చరించింది.

ఈ  జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

ఇక నిన్నటితో పాటు ఇవాళ మార్నింగ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెరువులొ 6.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 8.2, రాజేంద్ర నగర్‌లో10.5, మెదక్‌లో 8.8 హనుమకొండలో 11.5, రామగుండంలో 12.2, నల్లగొండలో 13, నిజామాబాద్‌లో 12.5,
దుండిగల్‌లో 12.4, హయత్ నగర్‌లో 13.6, హైదరాబాద్‌లో 13.2, భద్రాచలంలో 16, ఖమ్మంలో 14.6 హకీమ్ పేటలో 15, మహబూబ్ నగర్ లో 15.1
డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలి కాలంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బట్ట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటు వెళ్లినా స్వెట్టర్ లేదా జాకెట్‌ను పక్కా ధరించాలి, బైక్‌పై వెళ్లేప్పుడు చెవులు, తలను మొత్తం కవర్ చేసేలా హెల్మెట్‌, క్యాప్స్‌ ధరించాలి, చేతులకు గ్లౌజెస్ సైతం వేసుకోవాలి. కారులో ప్రయాణించే వారు విండ్‌షీల్డ్‌ను ఎప్పికప్పుడూ క్లీన్ చేసుకోవాలి, కారు వైజర్ పనిచేస్తుందో లేదో చూసుకోవాలి, కారులో ప్రయాణించేప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లాలి. ఎందుకంటే శీతాకాలంలో మంచు కురవడం వల్ల రోడ్డుపై తేమ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.