సింగరేణి కార్మికులు కదం తొక్కుతున్నారు. గనుల ప్రైవేటీకరణ ఒప్పుకోం. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే. లేదంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించింది కార్మికలోకం. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపేదిలేదంటున్నారు కార్మికులు. నాలుగు బ్లాకులను ప్రైవేట్ వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మూడ్రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే నోటీసులు అందజేసిన కార్మికులు.. గురువారం నుంచి మూడ్రోజుల పాటు విధులను బహిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నాలుగు బ్లాకుల వివరాలు ఇలా ఉన్నాయి. కల్యాణ్ ఖని బ్లాక్ -6, కోయగూడెం బ్లాక్ -3, సత్తుపల్లి బ్లాక్ -3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలం వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది.
బొగ్గు గనుల ప్రైవేటుపరం మరో 10 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాలు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఇందులో భాగంగా ఇప్పటికే విధులు బహిష్కరించిన కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Astro tips for wallet: మీ పర్సు ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?