CM Revanth Reddy: అప్పటి వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన జూమ్ సమావేశంలో నియోజకవర్గాల వారీగా అందిన రిపోర్టులపై సమీక్ష జరిపిన సీఎం..ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

CM Revanth Reddy: అప్పటి వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!
Telangana Congress Sir Process

Updated on: Jul 19, 2026 | 2:08 PM

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ రిపోర్టులపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పని చేయాలని ఆదేశించారు. ప్రక్రియ ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ గడువు పెంపును ఒక అవకాశంగా భావించి నాయకులంతా కదలాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల పాటు నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పని చేయాలి. ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు” అని సీఎం తేల్చి చెప్పారు.

బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) రిపోర్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయని ఇన్‌చార్జ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సీఎం.. బాగా పనిచేసిన 100 మంది బీఎల్ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం కల్పిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. జూలై 30వ తేదీన మరోసారి దీనిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు.

ఎమ్మెల్యేలు సీరియస్‌గా లేరు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఇంకా సీరియస్‌గా లేరని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా కచ్చితంగా ఈ ప్రక్రియలో యాక్టివ్‌గా పాల్గొనాలని, ఇంచార్జ్ మంత్రులు నిరంతరం దీనిపై ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. బీఎల్ఏలకు స్థానిక నాయకులు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.

నియోజకవర్గాల వారీగా ఎస్‌ఐఆర్ రిపోర్ట్ 

SIRపై నియోజకవర్గాల వారీగా సీఎం, పీసీసీకి రిపోర్ట్ అందింది. SIR 52 నియోజ‌క‌వ‌ర్గాలు బాగా ప‌నిచేస్తున్నాయి.. ఈ నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు BLAలను అభినందించారు. ప‌ర్వాలేద‌న్న స్థాయిలో మరో 42 నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. 21 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని బాగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్. నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లే ప‌నిచేయ‌లేదని రిపోర్ట్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us