CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరొక గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు అధికారిక ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సదస్సుకు భారత్ నుంచి ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే ఆహ్వానం అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!
Cm Revanth Reddy

Edited By:

Updated on: Feb 22, 2026 | 10:04 PM

ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఈ సింపోజియం జరుగనుంది. ప్రభుత్వం, పరిశ్రమలు, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ దిశపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.“AI as Infrastructure and Compute Power: Impact on Livability and Workforce” అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్యానెల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్, హైపర్‌స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలపై చూపే ప్రభావంపై చర్చ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐను కేవలం టెక్నాలజీగా కాకుండా కీలక మౌలిక సదుపాయంగా పరిగణిస్తున్న నేపథ్యంలో తెలంగాణ దృష్టికోణం అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించనుంది.

తెలంగాణ ఏఐ విజన్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ప్రతిపాదిత ఏఐ సిటీ రూపకల్పన, డేటా సెంటర్ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, భారీ స్థాయిలో కంప్యూట్ సామర్థ్యాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించనున్నారు. భూమి కేటాయింపులు, నిరంతర విద్యుత్ సరఫరా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్టార్టప్ ప్రోత్సాహకాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ వాతావరణం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. గ్లోబల్ టెక్ కంపెనీలు తెలంగాణను డేటా హబ్‌గా ఎంచుకునేలా రూపొందించిన విధానాలపై కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా సమన్వయం

ఈ సింపోజియం ప్రధాన లక్ష్యం ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం, విశ్వవిద్యాలయాలు కలిసి ఏఐ పాలనకు స్పష్టమైన దిశ నిర్ధేశం చేయడం. జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, డిజిటల్ సార్వభౌమత్వం, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.ఏఐ అభివృద్ధి కేవలం టెక్నాలజీ పురోగతికే పరిమితం కాకుండా శక్తి వినియోగం, ఉద్యోగ మార్కెట్, సామాజిక సమానత్వం వంటి విభిన్న రంగాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us