Telangana Cabinet: సీఎం రేవంత్‌రెడ్డి టిమ్‌ మరింత స్ట్రాంగ్‌.. కేబినెట్‌లోకి ముగ్గురు!

Telangana Cabinet: సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచీ ఒత్తిడి కూడా ఉంది. కొన్ని BC కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వచ్చింది. ఎస్సీల్లో మాల, మాదిగ సామాజికవర్గాల నుంచి కూడా ఎవరి వాదన వారు వినిపించారు..

Telangana Cabinet: సీఎం రేవంత్‌రెడ్డి టిమ్‌ మరింత స్ట్రాంగ్‌.. కేబినెట్‌లోకి ముగ్గురు!

Updated on: Jun 08, 2025 | 10:42 AM

తెలంగాణ సీఎం రేవంత్‌ టిమ్‌ మరింత స్ట్రాంగ్ అవుతోంది. కొత్తగా కేబినెట్‌లోకి ముగ్గురిని తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలు.. రాజకీయంగా బలాబలాలు.. అన్నీ లెక్కలు వేసుకుని సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ పేర్లు ఖాయం అయ్యాయి. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నా.. ప్రస్తుతం 3 భర్తీ చేస్తున్నారు. కొత్త మంత్రులకు ఇప్పటికే ఫోన్లు కూడా వెళ్లాయ్‌.

మధ్యాహ్నం 12.19కి మంత్రులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత వివేక్‌, శ్రీహరి, లక్ష్మణ్‌కు కేబినెట్‌ బెర్త్‌ ఖరారైంది. మంత్రులుగా ప్రమాణం చేయనున్న ముగ్గురికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారట. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్‌ నుంచి ఒక్కొక్కరికి చాన్స్‌ ఇచ్చారు. ఈ ముగ్గురి భర్తీ తర్వాత కేబినెట్‌లో ఇంకా మూడు ఖాళీలు ఉండనున్నాయి. డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్‌ పేరు ఖరారైంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్‌ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచీ ఒత్తిడి కూడా ఉంది. కొన్ని BC కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వచ్చింది. ఎస్సీల్లో మాల, మాదిగ సామాజికవర్గాల నుంచి కూడా ఎవరి వాదన వారు వినిపించారు. అన్నింటినీ పరిశీలించి చివరికి ఈ 3 పేర్లు ఖరారు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: WhatsApp Ban: వాట్సాప్‌ను బ్యాన్‌ చేసిన 6 దేశాలు ఏవో తెలుసా..? కారణం ఏంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి