CM Revanth: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.5 లక్షలు

Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన సీఎం.. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక వారికి 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు..

CM Revanth: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.5 లక్షలు

Updated on: Nov 01, 2025 | 8:21 AM

Telangana CM Revanth Reddy: మొంథా తుపాను తెలుగు రాష్ట్రాలకు అతలకుతలం చేసింది. తుఫాను కారణంగా పంట నష్టంతో పాటు చాలా ఇళ్లు తీవ్రంగా నష్టపోయాయి. నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్రెడ్డి వరద ప్రరభావిత ప్రాంతాలను ఏరియల్సర్వే నిర్వహించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని, అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే నీట మునిగిన ఇంటికి రూ.15 వేలు, ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అంశంపై పరిశీలిస్తామని తెలిపారు. అలాంటి వారికి ఇల్లు మంజూరు కోసం పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే హనుమకొండ కలెక్టరేట్‌లో ఏడు జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరద నష్టాలపై తక్షణమే నివేదికలు తయారు చేయాలని సూచించారు. వరద కారణంగా గొర్రె చనిపోతే రూ.5 వేలు, గేదె, ఆవు చనిపోయినట్లయితే రూ.50 వేల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు.

అలాగే వర్షాల కారణంగా కూలిపోయిన ఇల్లు, షెడ్లను సీఎం పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వర్షాల కారణంగా పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, నిత్యావసరాలు, ఇతర సామగ్రి మొత్తం వరదలోనే కొట్టుకుపోయాయని బాధితులు సీఎంకు వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాను. ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి