CM KCR Reached Warangal: వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సెంట్రల్ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
చారిత్రక నగరం ఓరుగల్లు జాతీయస్థాయి మెడికల్ హబ్‌గా మారనుంది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్‌ను ప్రభుత్వం వరంగల్‌లో నిర్మిస్తోంది. AIMS స్థాయి సేవలను ఈ ఆస్పత్రిలో అందుబాటులోకి తేనుంది ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్న తెలంగాణ సర్కార్ ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి పెద్దా ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా వెయ్యి కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇవాళ ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
Read Also…. మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సీదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.