మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సేదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.

ఓ ఎద్దు ఏకంగా మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి వెళ్లి బెడ్‌రూంలోని బెడ్‌పై పడుకుని ఎంచక్కా సేదతీరింది.అయితే ఎద్దు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో గమనించని ఆ కుటుంబ సభ్యులు సడెన్‌గా బెడ్‌పై నిద్రపోతున్న ఎద్దును చూసి హడలిపోయారు.


ఓ ఎద్దు ఏకంగా మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి వెళ్లి బెడ్‌రూంలోని బెడ్‌పై పడుకుని ఎంచక్కా సేదతీరింది.అయితే ఎద్దు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో గమనించని ఆ కుటుంబ సభ్యులు సడెన్‌గా బెడ్‌పై నిద్రపోతున్న ఎద్దును చూసి హడలిపోయారు. తర్వాత అక్కడి స్థానికుల సాయంతో దాన్ని కిందకు తీసుకొచ్చి విడిచిపెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రీవాలో చోటుచేసుకుంది. సహజంగా సాధు జంతువులు ఇంట్లోకి రావడం మాములే.. కుక్కలు, పిల్లలు అయితే మన కాళ్ళ మధ్య తిరుగుతూ..మనం ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఎన్ని ఫ్లోర్లు అయిన అలవోకగా ఎక్కగలవు. కానీ ఎద్దు లాంటి బారి జంతువు మూడు ఫ్లోర్లు మెట్లెక్కి ఇంట్లోకి రావడంతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు.అయితే, ఆ ఎద్దు ఇరుకైన మెట్ల దారిలోనే మూడు ఫ్లోర్లు ఎక్కి వచ్చినప్పటికీ దానిని ఎవరూ గమనించలేదు.. తర్వాత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోని వారంతా టీవీ చూస్తూ బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఎద్దు ఇంట్లోకి వచ్చేసి.. బెడ్‌రూంలోకి వెళ్లింది. అక్కడ ఉన్న అద్దంలో చూస్తూ.. నెమరు వేసుకుంటూ కాసేపు కునుకు తీసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.

త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?

Kajal Aggarwal birthday special video:కాజల్ బర్త్ డే స్పెషల్ వీడియో కాజల్ కెరీర్‏లోనే గుర్తుండిపోయే పాత్రలెన్నో..

Click on your DTH Provider to Add TV9 Telugu