Telangana CM: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసు.. అరుదైన వ్యాధి చికిత్సకు రూ.25 లక్షలు మంజూరు..

|

Oct 12, 2021 | 9:21 AM

Telangana Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతికి చికిత్స అందించేందుకు..

Telangana CM: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసు.. అరుదైన వ్యాధి చికిత్సకు రూ.25 లక్షలు మంజూరు..
Minister Niranjan Reddy
Follow us on

Telangana Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతికి చికిత్స అందించేందుకు రూ. 25 లక్షలు మంజూరు చేశారు. యువతికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వనపర్తికి నియోజకవర్గం రేవల్లికి చెందిన శివాని పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ముదిరితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌తో ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. కానీ, చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మాత్రమే ఈ అరుదయిన చికిత్స చేసే ఛాన్స్ ఉంది.

అయితే, శివాని తండ్రి బాల్ రెడ్డి క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక తనలో తానే కుమిలిపోయాడు. ఈ క్రమంలో వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సంప్రదించారు. తన కూతురు పరిస్థితిని వివరించాడు. వెంటనే స్పందించిన మంత్రి.. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కూడా యువతి పరిస్థితికి చలించిపోయారు. శివానీ చికిత్సకు రూ. 25 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. దీనికి సంబంధించి చెక్‌ను ఇవాళ వనపర్తిలోని తన నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి.. బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ కూతురు వైద్యానికి సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్ రెడ్డికి శివాని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Also read:

గేల్, రస్సెల్, మ్యాక్స్‌వెల్‌ను మించిపోయాడు.. సిక్సర్ల రారాజుగా అవతరించాడు.. ఎవరో తెలుసా.?

Virat Kohli: 9 ఏళ్ల నిరీక్షణ ఫలించలే.. ఆర్‌సీబీకి మరోసారి మొండిచేయి.. కోహ్లీ కెప్టెన్సీలో అందని ద్రాక్షగానే ఐపీఎల్ ట్రోఫీ..!

Viral Video: పెళ్లి వేదికపై మరీ ఇంతలానా.. వధువు చేసిన పనికి వరుడు షాక్.. చూస్తే నవ్వాపుకోలేరు!