
సారొచ్చారు. సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్నారు. మూడు వారాలుగా వైరల్ ఫీవర్ ఆతర్వాత జనంలోకి వచ్చారు. దాదాపు 25 రోజుల తర్వాత ప్రజలకు కనిపించారు. పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్టోబర్ 13న మొదటిసారిగా బయటకు వచ్చారు. జ్వరం, జలుబుతో సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా విశ్రాంతిలోనే ఉన్నారు. పూర్తిగా ప్రగతి భవన్‌కే పరిమితమైన ఆయనకు.. ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది. మూడు వారాలు వైరల్ ఫీవర్ ఆ తర్వాత చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకున్నారు. ఆయనకు జ్వరం తగ్గినా నీరసం తగ్గకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు ఇంతకాలం రెస్ట్ తీసుకున్నారు.
కొద్ది రోజుల ముందే ఆయన కోలుకున్నారు. నీరసం వల్ల బయటకు రాలేకపోయినా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులపై ఆరా తీస్తూనే ఉన్నారు. మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావులతో నిత్యం సమావేశమైన ఆయన తన ఎలక్షణ్ క్యాంపెయిన్‌పై వారితో చర్చించారు. ఒంట్లో బాగోలేకపోయినా.. పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు కేటీఆర్, హరీష్‌రావులతో కలిసి ఎన్నికల కార్యాచరణ రూపొందించారు. ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో సమావేశాలు జరిపారు కేసీఆర్. అనేక కార్యక్రమాలను ఆయన స్వయంగా రూపొందించారు. ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కూడా కీలక నేతలతో చర్చలు జరిపారు.
గత నెలలోనే వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురైన సీఎం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రికి వైరల్ ఫీవర్ సోకింది. అనారోగ్యం వల్ల సీఎం కేసీఆర్ బయటకు రాలేకపోయారు. అయితే తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేసీఆర్ ఎంట్రీ కోసం పార్టీ కేడర్ ఎదురుచూపులు చూస్తున్న సమయంలో తాజా సీఎం బయటకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు చేరుకొని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 12న మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజుల మృతి చెందారు. దీంతో మంత్రి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపిన సీఎం.. స్వయంగా వెళ్ళి పరామర్శించారు.
అసలేం జరిగింది..
గత నెలలోనే కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ సోకిన అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ విషయాన్ని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కానీ ఆయన కోలుకుంటున్నట్లు వారికి సమాచారం ఇచ్చారు. అయితే.. వైరల్ ఫీవర్ కారణంగా సెకండ్ గ్రేడ్ చెస్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావడంతో.. ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగింది. మూడు వారాల తర్వాత నిన్న ఆయన పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు ప్రోగ్రెస్‌రిపోర్ట్‌ను కేసీఆర్‌కు అందించిన సందర్భంగా ఈ ఫొటో తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి చనిపోవడంతో.. శుక్రవారం ఆయన నిజామాబాద్ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇక అక్టోబర్ 16 నుంచి కేసీఆర్ ఎన్నికల క్యాంపేన్‌కు సిద్ధమవుతున్నారు. నవంబర్ 9న నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..