
తెలంగాణలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వ శక్తులు కష్టపడిన రాజకీయ పార్టీలు ఎన్నికలు ముగిశాక.. బయటకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా.. లోలోపల ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో పదవ వార్దుకు చెందిన అధికార పార్టీ అభ్యర్థి గెలుపుపై ఆందోళన చెందాడు. ఫలితాలు రాకముందే తాను ఓడిపోతానేమోనని ఆందోళన చెంది ఓటర్లకు తాను పంచిన గిఫ్ట్‌లను వెనక్కి ఇచ్చేయాలంటూ పట్టు పట్టాడు.. దీంతో ఎన్నికలకు గిఫ్ట్‌లుగా ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్‌లను రోడ్డుపై పడవేసి ఆందోళన చేపట్టారు కాలనీవాసులు. అయితే ఈ నెల 13 న జరిగిన కౌంటింగ్‌లో తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు అధికారి పార్టీ అభ్యర్థిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఫలితాల్లో ఆ అభ్యర్థి 237 ఓట్లు మెజారిటీతో గెలుపొందాడు. స్థానిక ఓటర్లు ఆ అభ్యర్థికే జై కొట్టారు. ఆ అభ్యర్థి ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయలేదు.
అసలేం జరిగిందంటే
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని పదో వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలంటూ డబ్బులు, కుక్కర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే 11న ఎలక్షన్స్ ముగిసిన తర్వాత గిఫ్ట్‌లు పంచిన వ్యక్తులు ఓటర్ల దగ్గరకు వచ్చిన.. మీరు మాకు ఓటు వేయలేదని.. తాము ఇచ్చిన గిఫ్ట్‌లు, కుక్కర్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారని.. దీంతో కాలనీలోని మహిళలందరూ తమకు ఇచ్చిన కుక్కర్లను తీసుకువచ్చి, వాటిపై పంపిణీ దారుల పేర్లు రాసి రోడ్లపై పడవేశారు.
తాము అడగకుండానే తమకు గిఫ్ట్‌లు ఇచ్చి.. ఇప్పుడు వెనక్కి అడగటం ఏమిటని, అసలు ఇంకా కౌంటింగ్ కూడా జరగకుండా ఓట్లు మేము వేయలేదని వీళ్లు ఎలా అంటారని కాలనీవాసులు ప్రశ్నించారు. అయితే 13న వెలువడిన ఎన్నికల ఫలితాల తర్వాత ఆ కాలనీవాసులు అడిగిన ప్రశ్నే నిజమైంది. ఈ ఎన్నిల్లో వారికి గిఫ్ట్ పంచిన అభ్యర్థే కౌన్సిలర్‌గా గెలిచాడు. ఓటర్లు కూడా తమ కృతజ్ఞత చాటుకున్నారు.
ఇదిలా ఉండగా గెలిచిన అభ్యర్థి మాత్రం ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని.. తాను స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని.. కొందరు కావాలని తనపై కుట్రతో ఈ తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి