Telangana PRC: పీఆర్‌సీ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఇవాళ వేతన సవరణపై కీలక ప్రకటన చేసే ఛాన్స్!

|

Jun 08, 2021 | 9:54 AM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. లాక్‌డౌన్ ఎత్తివేత.. మధ్యాహ్నం భేటీ కానున్న రాష్ట్ర కేబినెట్ లాక్ డౌన్ అంశంతో పాటు.. పీఆర్సీపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Telangana PRC: పీఆర్‌సీ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఇవాళ వేతన సవరణపై కీలక ప్రకటన చేసే ఛాన్స్!
Cm Kcr
Follow us on

Telangana Govt.Employees PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. లాక్‌డౌన్ ఎత్తివేత.. మధ్యాహ్నం భేటీ కానున్న రాష్ట్ర కేబినెట్ లాక్ డౌన్ అంశంతో పాటు.. పీఆర్సీపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలోనే తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే, మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఫిట్‌మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని అన్నారు. అయితే ఆ తరువాత మళ్లీ లాక్‌డౌన్ పెట్టాల్సి రావడంతో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది అమలు కాలేదు. ఈమేరకు మంత్రి మండలి సమావేశంలో ఆమోద తెలుపనున్నట్లు సమాచారం. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించింది. దీంతో ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. ఉద్యోగుల ఫిట్ మెంట్, ఇతర అంశాలపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేయనుంది.

Read Also… కరోనా సమయంలో దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. లక్షకు దిగువన నమోదైన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!