Telangana: రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు.. మరోవైపు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. అలానే, 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న 17 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇష్యూ చేసింది.

Telangana: రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు.. మరోవైపు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Telangana Weather

Updated on: May 01, 2025 | 8:13 AM

మే 1, గురువారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, ములుగు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.  గురువారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 43.6, కనిష్టంగా నల్లగొండ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, నల్లగొండ, ఖమ్మం భద్రాచలంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

ఆదిలాబాద్.. 43.6, నిజామాబాద్.. 42.8, రామగుండం.. 41, నల్లగొండ.. 41,మెదక్.. 40.6,ఖమ్మం.. 40, భద్రాచలం.. 40, మహబూబ్ నగర్.. 39,
హనుమకొండ.. 39,  హైదరాబాద్.. 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us