Telangana: ఫోన్ కొనివ్వలేదని అమ్మకు కడుపుకోత మిగిల్చాడు.. పాలెం వాగు సాక్షిగా…

ఈ మధ్య టీనేజ్ పిల్లలు.. చిన్న.. చిన్న కారణాలతో జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. ఇది దృష్టి పెట్టాల్సిన అంశం. కౌమార దశలో ఉన్నవారు చాలా అగ్రెసీవ్‌గా ఉంటారు. వారిని తల్లిదండ్రులు సన్మార్గంలో నడిపించాలి.

Telangana: ఫోన్ కొనివ్వలేదని అమ్మకు కడుపుకోత మిగిల్చాడు.. పాలెం వాగు సాక్షిగా...
Palemvagu Project

Updated on: Jun 01, 2022 | 11:22 AM

నేటి కాలంలో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోనే ప్రపంచంగా మారింది. పిల్లలు, పెద్దలు మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సెల్‌ఫోన్ లేనిదే జీవితం లేదన్నట్టు తయారవుతున్నారు. తాజాగా సెల్ ఫోన్ కొనివ్వలేదనే కోపంతో క్షణికావేశానికి లోనైన ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటు చేసుకుంది. వెంకటాపురం మండలం(venkatapuram mandal )ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన సాయి లిఖిత్ అనే విద్యార్థి.. గత కొద్దిరోజులుగా తనకు సెల్‌ఫోన్ కొని పెట్టాలని తల్లిని అడుగుతున్నాడు. తన వద్ద డబ్బులు లేవని, తర్వాత కొని పెడతానని ఆమె నచ్చచెబుతూ వచ్చింది. ఈ విషయమై ఇంట్లో గొడవపడ్డ సాయి లిఖిత్..  తీవ్ర మనస్తాపానికి గురై.. పాలెం వాగు ప్రాజెక్టు(Palemvagu project )లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఇచ్చిన సమాచారంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ మధ్య టీనేజ్ పిల్లలు.. చిన్న.. చిన్న కారణాలతో జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. ఇది దృష్టి పెట్టాల్సిన అంశం. కౌమార దశలో ఉన్నవారు చాలా అగ్రెసీవ్‌గా ఉంటారు. వారిలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలతో పేరెంట్స్ కాస్త ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటే ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపే అవకాశం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి