MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుకు బీజేపీ సిద్ధం.. అభ్యర్థులు ఖరారు..!

|

Dec 20, 2020 | 12:33 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక...

MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుకు బీజేపీ సిద్ధం.. అభ్యర్థులు ఖరారు..!
Follow us on

MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఊపుమీదున్న ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసింది. రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డిల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. వీరి పేర్లను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఫిబ్రవరి చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సర్వసన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ అంతంత మాత్రంగానే ఉన్నా.. తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్న తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. విద్యార్థులను, విద్యావంతులను కలుస్తున్నారు.

 

Also read:

Tomato prices : మొన్నటివరకు సామాన్యులకు చుక్కలు, ఇప్పుడు రైతులకు కన్నీళ్లు..రూపాయికే కిలో టమోటా

India Corona Cases : దేశంలో కొత్తగా 26,624 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి