AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇంట్లో భారీ గొయ్యి… ఈ ఇంట్లో బాలిక మిస్సింగ్…గుప్త నిధుల కోసం పూజలు..అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో మిస్టరీ నెలకుంది.  గుప్త నిధుల కోసం బాలికను బలిచ్చారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఆ ఇంట్లో భారీ గొయ్యి... ఈ ఇంట్లో బాలిక మిస్సింగ్...గుప్త నిధుల కోసం పూజలు..అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు
Ram Naramaneni
|

Updated on: Dec 20, 2020 | 12:41 PM

Share

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో మిస్టరీ నెలకుంది.  గుప్త నిధుల కోసం బాలికను బలిచ్చారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే…రేమిడిచర్లకి చెందిన వెల్లంకి వెంకట్రావు, రాణి దంపతుల కుతురు రాజశ్రీ (16) వరంగల్‌లో నివసిస్తున్న తన బాబాయి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉండి చదువుకుంటోంది.  అయితే ఇటీవల నాగేశ్వరరావు మామ నర్సింహారావు ఇంట్లో గుప్తనిధులు వున్నట్లు..అవి వశమవ్వాలంటే రాజశ్రీతో పూజలు జరిపి, నరబలి ఇవ్వాలని మాంత్రికులు తెలిపారట. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకూ తెలుసనే ప్రచారం జరుగుతోంది. పూజల అనంతరం ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

రాజశ్రీ అమ్మానాన్నలు ఈ నెల 17న గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని గుడికి వెళ్లారు. రాజశ్రీకి జ్వరంగా ఉందని ఆమెను ఇంట్లోనే ఉంచారు. వారు తిరిగి వచ్చేసరికి బాలిక మిస్సయ్యింది. దీంతో ఆమె తల్లి ఈ నెల 18న పోలీసులకు కంప్లైంట్. తాను హైయ్యర్ స్టడీస్ కోసం ఇల్లు విడిచి వెళ్తున్నానని బాలిక ఇంగ్లిష్‌లో రాసిన లేఖ ఆమె ఇంట్లో పోలీసులకు దొరికింది. విషయం తన ఫ్రెండ్ శరణ్యకు తెలుసని, చదువు పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని అందులో ఆమె రాసుకొచ్చింది. అయితే ఈ లెటర్ రాజశ్రీనే రాసిందా, లేక బలవంతంగా రాయించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శరణ్యను విచారించగా, మహారాష్ట్రలోని అంబాని ఆశ్రమానికి వెళ్తానని రాజశ్రీ చెప్పినట్లు తెలిపింది.  రాజశ్రీ మొబైల్‌ను లొకేషన్‌ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాలికను నర బలి ఇచ్చి ఇదంతా ప్లాన్ చేశారా..? లేక తను నిజంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందా.. మాంత్రికులు వేరే ప్రాంతాలకు తీసుకెళ్లారా అనే విషయాలపై ఇప్పడు సస్పెన్స్ నెలకుంది.

Also Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి