Telangana Budget 2022: ఈ నెల 15 వరకు బడ్జెట్ సమావేశాలు.. BAC సమావేశంలో నిర్ణయం

|

Mar 07, 2022 | 5:04 PM

Telangana BAC Meeting: తెలంగాణ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలను ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు నిర్వహించాలని బీఏసీ (శాస‌న‌స‌భా వ్యవహారాల స‌ల‌హా సంఘం) నిర్ణయించింది.

Telangana Budget 2022: ఈ నెల 15 వరకు బడ్జెట్ సమావేశాలు.. BAC సమావేశంలో నిర్ణయం
Telangana Assembly
Follow us on

Telangana BAC Meeting: తెలంగాణ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలను ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు నిర్వహించాలని బీఏసీ (శాస‌న‌స‌భా వ్యవహారాల స‌ల‌హా సంఘం) నిర్ణయించింది. శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జ‌రిగిన బీఏసీ స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి. ఈ రోజు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కావున రేపు సెలవు ఉంటుంది.. అలాగే ఈనెల 13న ఆదివారం కావున ఆరోజు కూడా సభ ఉండదు. 9వ తేదీన బ‌డ్జెట్‌పై సాధార‌ణ చ‌ర్చ చేపట్టనున్నారు. 10, 11, 12, 14 తేదీల్లో ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చించనున్నారు. 8, 13వ తేదీల్లో స‌భ‌కు సెల‌వు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుతో కలుపుకొని మొత్తం వారం రోజులు పనిదినాలుగా ఉంటాయి. ఈ సెషన్స్‌లో 3 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఏసీ సమావేశానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, చీప్ విప్‌ వినయ భాస్కర్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ హాజరయ్యారు.

కాగా.. అంతకుముందు తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మంత్రి హరీష్ రావు 2022- 23 సంవత్సరానికిగానూ 2,56,958. 51 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశామని తెలిపారు.

Also Read:

Telangana: మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే..

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‎ గౌడ్‎ హత్యకు కుట్ర కేసు.. మరో నాలుగు రోజుల కస్టడీకి నిందితులు