Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటికి నాల్గొవ రోజుకు చేరాయి. శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. నాలుగో రోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నలు ముఖ్యంగా, దళిత బంధు పథకం, హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్ నగరంలో దోమలు, ఈగల బెడద, వంతెనల మంజూరు, ఐటిఐని షాద్ నగర్ కు మార్చడం అంశాలు ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రెండు రోజుల విరామం తర్వాత శాసనసభ ఎనిమిదో విడత, నాలుగో రోజు సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పిస్తారు. ఇక, శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.
స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చ ఉంటుంది. శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చతోపాటు ఈ నెల 1న శాసనసభ ఆమోదించిన నాలుగు ప్రభుత్వ బిల్లులపై కూడా చర్చ జరుగుతుంది.
Read also: Badvel By Election: బద్వేల్ బైపోల్‌లో ఊహించని పరిణామాలు.! సరికొత్త చర్చలు.. మారుతోన్న సమీకరణాలు