కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం వివక్ష చూపుతుందంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభలో ప్రవేశపెడుతారు. 23వ పవర్ డిస్ట్రిబ్యూషన్ వార్షిక బడ్జెట్, ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ వార్షి నివేదికను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సభ ముందుంచుతారు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై షార్ట్ డిస్కషన్ జరగనుంది. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంతాపం తెలపనుంది సభ.
మరోవైపు ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేశాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీపై నిలదీసేందుకు సిద్ధమైంది బీఆర్‌ఎస్. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు.. బీఆర్‌ఎస్‌ఎల్పీలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మొత్తం 8 అంశాలను సభలో లేవనెత్తాలని పార్టీ భావిస్తోంది. అటు మేడిగడ్డపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించింది. రేపు బడ్జెట్ అనంతరం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు వెళ్తారు. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృథాగా పోతున్నా ప్రభుత్వం పంపుల ద్వారా ఎత్తిపోయడం లేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై వాయిదా తీర్మానం ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…