Telangana Elections: ఆదివాసీ గూడాల్లో ఈ రథమే తమ ప్రచార రథం అంటున్న కమలం నేతలు
ఎన్నికల ప్రచారం అనగానే అదిరిపోయే రూపాల్లో ప్రచార రథాలు.. సినిమా సెట్టింగ్‌లను మరిపించే డెకరేషన్లు.. ఆకట్టుకునే డీజే పాటల మోతలు.. ఇవే కనిపిస్తాయి. కానీ నిర్మల్ జిల్లాలో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో ఓ పార్టీ ప్రచార రథాన్ని చూస్తే మాత్రం వావ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనాల్సిందే! కోట్లు కుమ్మరించి ప్రచారం చేస్తున్న ఈ ఎన్నికల సీజన్‌లో..

ఎన్నికల ప్రచారం అనగానే అదిరిపోయే రూపాల్లో ప్రచార రథాలు.. సినిమా సెట్టింగ్‌లను మరిపించే డెకరేషన్లు.. ఆకట్టుకునే డీజే పాటల మోతలు.. ఇవే కనిపిస్తాయి. కానీ నిర్మల్ జిల్లాలో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో ఓ పార్టీ ప్రచార రథాన్ని చూస్తే మాత్రం వావ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనాల్సిందే! కోట్లు కుమ్మరించి ప్రచారం చేస్తున్న ఈ ఎన్నికల సీజన్‌లో..
అసలే రోడ్డు రవాణా వ్యవస్థ అంతంతగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామాల్లో ప్రచార రథాలను తిప్పాలంటే కష్టం అనుకున్నారో.. లేక ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ అనుకున్నారో ఏమో గానీ అదిరిపోయే ఐడియాతో ఎడ్లబండ్ల ప్రచార రథాన్ని మారు మూల గ్రామాల్లో చక్కర్లు కొట్టిస్తూ.. వావ్ వాటే ఐడియా సర్ జీ అనిపించుకుంటున్నారు కమలం పార్టీ ఖానాపూర్ నియోజక వర్గ నేతలు. ఇంద్రవెళ్లి, ఉట్నూర్ మండలాలలోని మారుమూల గిరిజన గ్రామాల్లో బైల్ గాడితో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంలో సరికొత్తగా దూసుకుపోతున్నారు. అసలే ఆదివాసీ మారు మూల గ్రామాలు, తండాలు ఎక్కువ ఉన్న నియోజక వర్గం కావడం.. రహదారి కష్టాలనుఎదుర్కొంటున్న గూడాల్లో అందరికన్నా భిన్నంగా ఆలోచించారు. ఎడ్ల బండ్లపై పల్లె పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఎంపీటీసీ పడ్వాల్ విజయ్ సింగ్ ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఈ ఎడ్ల బండిపై వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదే నియోజక వర్గంలోని ఉట్నూర్ మండల కమలం నేతలు ఫాలో అవుతున్నారు.
మొదటగా ఈ ఎద్దుల బండ్ల ప్రచార రథాన్ని ఇంద్రవెల్లి మండలం నుండి ప్రారంభించారు. ఏమాయికుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామీ మందిరంలో ఎడ్ల బండి ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభించారు పడ్వాల్ విజయ్ సింగ్. ఖానాపూర్ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ రమేష్ గెలుపే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రచారం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండలం నుండి ఉట్నూర్, జన్నారం, దస్తురాబాద్, కడెం, పెంబి, ఖానాపూర్ మండలాలోని మారు మూల గ్రామాల గుండా సాగుతుందని తెలిపారు. ఈ ఎడ్ల బండి ప్రచార రథంతో ఖర్చు కలిసి రావడంతో పాటు.. గ్రామ గ్రామానికి బీజేపీ జెండాను చేర్చే అవకాశం దక్కుతుందంటున్నారు ఖానాపూర్ బీజేపీ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..