Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagtial Politics: జగిత్యాలలో ఇవే తనకు చివరి ఎన్నికలంటున్న పెద్దాయన.. రెండోసారి అవకాశం కోసం డాక్టర్ సాబ్

జరుగుతున్న ఎన్నికలు.. తనకు చివరి ఎన్నికలంటూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. ప్రతిసారీ.. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు ఉంది. ఇప్పుడు వీటికి తోడు బీజేపీ కూడా రంగలోకి దిగింది.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విబేధాల కారణంగా.. మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.

Jagtial Politics: జగిత్యాలలో ఇవే తనకు చివరి ఎన్నికలంటున్న పెద్దాయన.. రెండోసారి అవకాశం కోసం డాక్టర్ సాబ్
Jeevan Reddy Sanjay Kumar Boga Sravani
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Oct 27, 2023 | 11:16 AM

తెలంగాణ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ పాత కాపుల మధ్యన పోరు నెలకొంది.. అయితే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తుంది. గతంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా పనిచేసిన భోగ శ్రావణి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి తనకు చివరి ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారు. రెండోసారి అవకాశం ఇస్తే, మరింత అభివృద్ధి చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ చెబుతున్నారు. మరి ఇక్కడ. ఓటరు మదిలో ఏముందో.. బయటకు చెప్పడం లేదు. మూడు పార్టీలు మాత్రం, గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ.. ప్రచార పర్వంలో ముందుకెళ్తున్నాయి..

జగిత్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మరోసారి బరిలోకి దిగుతున్నారు.. సంజయ్. 2014లో ఓటమి పాలయ్యారు. తరువాత 2018లో భారీ మెజారిటితో విజయం సాధించారు. ఈ రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపైనే నెగ్గడ విశేషం. ఈసారి కూడా జీవన్ రెడ్డితో పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి.. సంజయ్ మధ్య పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో సంజయ్ గెలిచారు. మూడోవ సారి వీరిద్దరూ బరిలోకి దిగుతున్నారు

అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు.. తనకు చివరి ఎన్నికలంటూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. ప్రతిసారీ.. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు ఉంది. ఇప్పుడు వీటికి తోడు బీజేపీ కూడా రంగలోకి దిగింది.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విబేధాల కారణంగా.. మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఈమెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే, ఇక్కడ పద్మశాలి ఓట్లు.. ప్రభావితం చేస్తాయి. ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శ్రావణి. అంతేకాకుండా బీసీ నినాదాన్ని కూడా బీజేపీ ఎత్తుకుంది. అదే విధంగా మహిళ ఓటర్లపై ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు. త్రిముఖ పోరు కారణంగా ఈ ఇద్దరు అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే సంజయ్‌కు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్క వేళా బీఆర్ఎస్ ఓట్లను చీల్చితే.. కాంగ్రెస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కూడా ప్రభావం చూపుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ కు ఓటు వేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో తనకు ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ భావిస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం.. మైనారిటీ ఓట్లు తనకే వస్తాయని ధీమాతో ఉన్నారు. మైనారిటీ ఓట్లు రెండు పార్టీలు చీల్చుకుంటే.. తనకు లాభం జరుగుతుందని బీజేపీ భావిస్తుంది.

బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తిగా నమ్ముకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఎక్కవ మంది లబ్ధిదారులకు అందజేశారు. అదే విధంగా మౌలిక వసతులు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేశానని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాత్రం దళిత బంధు, బీసీ బంధు ఇతర సంక్షేమ పథకాలు: అందలేదని, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. జీవన్ రెడ్డి కూడా సీఎం రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మొదటి సారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీగా చేస్తున్నారు శ్రావణి. బిసి నినాదంతో పాటు.. పసుపు బోర్డు లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళ ఓటర్లు అధికంగా ఉండటంతో, వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి, ఈ మూడు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

మరోసారి జీవన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తానని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చెబుతున్నారు. తాను చేసిన అభివృద్దే గెలుపుస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు తప్పా.. ఎవరూ అభివృద్ధి చెందలేని.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదంటున్నారు. ఇంతకాలం బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను చూశారని. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి. బీసీలకు తమ పార్టీ అవకాశం ఇచ్చిందని, తనను గెలిపించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గబ్బా కూల్చివేత నిర్ణయం.. షాక్ లో క్రికెట్ ప్రపంచం!
గబ్బా కూల్చివేత నిర్ణయం.. షాక్ లో క్రికెట్ ప్రపంచం!
Video: పాక్ ఫీల్డర్లు పూనుకున్నారా ఏంది.. సింపుల్ క్యాచ్‌ మిస్..
Video: పాక్ ఫీల్డర్లు పూనుకున్నారా ఏంది.. సింపుల్ క్యాచ్‌ మిస్..
రజనీని అంతలా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. చివరకు నిర్మాతతో
రజనీని అంతలా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. చివరకు నిర్మాతతో
తీపిని పంచే చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? వీరికి విషంతో సమ
తీపిని పంచే చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? వీరికి విషంతో సమ
Money Astrology: ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే!
Money Astrology: ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే!
కేంద్రం సంచలన నిర్ణయం.. 2 నెలల్లో 8 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్
కేంద్రం సంచలన నిర్ణయం.. 2 నెలల్లో 8 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్
అటు వర్షాలు.. ఇటు వడగాల్పులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం
అటు వర్షాలు.. ఇటు వడగాల్పులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం
దిగ్గజ దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత.. ఏమైందంటే?
దిగ్గజ దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత.. ఏమైందంటే?
ఈ పండ్లు షుగర్ బాధితులకు ప్రాణాంతకం.. అస్సలు తినకూడదు..!
ఈ పండ్లు షుగర్ బాధితులకు ప్రాణాంతకం.. అస్సలు తినకూడదు..!
రూ. 2 కోట్ల ఆఫర్ రిజక్ట్.. ఢిల్లీ జట్టుకు ఊహించని షాక్
రూ. 2 కోట్ల ఆఫర్ రిజక్ట్.. ఢిల్లీ జట్టుకు ఊహించని షాక్