MIM tickets fight: సిట్టింగులను మార్చే యోచనలో ఎంఐఎం.. ఆశావహులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎంఐఎం కూడా ఇప్పటికే గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైంది. అయితే.. ఎంఐఎంకు కంచుకోటలుగా ఉన్న హైదరాబాద్‌లోని పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని యోచించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

MIM tickets fight: సిట్టింగులను మార్చే యోచనలో ఎంఐఎం.. ఆశావహులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌
Aimim Meeting

Updated on: Oct 27, 2023 | 8:27 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల పంచాయితీలు నడుస్తున్నాయి. సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికల్లో నిమగ్నమయ్యాయి. దశల వారీగా లిస్ట్‌లు రిలీజ్‌లు చేస్తున్నాయి. ఇదంతా కామన్‌.. బట్‌.. ఇప్పుడు.. ఎంఐఎం వంతు కూడా వచ్చింది. కూల్‌గా సాగిపోయే ఎంఐఎం పార్టీలోనూ అభ్యర్థులను మార్చాలనే నిర్ణయం.. ఆ పార్టీ సిట్టింగుల్లో కంగారు పుట్టిస్తోంది. ఇంతకీ.. సిట్టింగ్‌లను మార్చాలని ఎంఐఎం ఎందుకు డిసైడ్‌ అయింది?.. అదే జరిగితే.. ఎంఐఎంలో ఆ సిట్టింగుల దారెటు? అన్నదీ ఇప్పడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ ‌టాపిక్‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎంఐఎం కూడా ఇప్పటికే గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైంది. అయితే.. ఎంఐఎంకు కంచుకోటలుగా ఉన్న హైదరాబాద్‌లోని పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని యోచించడం హాట్‌ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని చార్మినార్‌, యాకుత్‌పురా, నాంపల్లి నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చాలని ఎంఐఎం భావిస్తోంది.

అయితే.. చార్మినార్‌ స్థానంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. చార్మినార్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ 1994 నుంచి యాకుత్‌పురాలో వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ.. గత ఎన్నికల్లో ఆయన్ను చార్మినార్‌ నుంచి బరిలోకి దించారు. యాకుత్‌పురాలో వ్యతిరేకతతోపాటు పలు ఆరోపణలు రావడంతో ఖాన్‌ను చార్మినార్‌ నుంచి పోటీ చేయించగా అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలిచారు.

వాస్తవానికి.. తొలిసారి యాకుత్‌పురా నియోజకవర్గంలో ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఎంబీటీ నుంచి పోటీ చేసి గెలిచాక ఎంఐఎంలో చేరారు. అయితే.. గత ఎన్నికల్లో ఆయనకు చార్మినార్‌ కేటాయించడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రి యాకుత్‌పురా నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఇప్పుడు అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ను పక్కన పెట్టాలని ఎంఐఎం నిర్ణయించింది. ఆ స్థానంలో మరొకరిని పోటీ చేయించాలని చూస్తోంది. అలాగే.. చార్మినార్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. అక్బరుద్దీన్‌.. అహ్మద్‌ఖాన్‌ను కలిసి దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. చార్మినార్‌ బరి నుంచి తప్పుకోవాలని కోరారు. సుదీర్ఘకాలం పనిచేశారని, తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలని నచ్చచెప్పగా.. అహ్మద్‌ఖాన్‌ మాత్రం ససేమిరా అనడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజాసేవలో మరికొంతకాలం కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ.. తనకు ఇవ్వకపోతే.. ఫ్యామిలీలోని ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని అహ్మద్‌ఖాన్‌ కోరినట్లు ఎంఐఎం పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.

ఇదిలావుంటే.. ఎంఐఎం చరిత్ర ఓసారి పరిశీలిస్తే.. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే టికెట్‌ కేటాయించే అనవాయితీ ఉంది. అనివార్య కారణాలతో ఎమ్మెల్యేలను మార్చితే.. మళ్లీ ఆ స్థానంలో కొత్తవారికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే.. నాంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యేని యాకుత్‌పురాకి మార్చి.. నాంపల్లి, చార్మినార్‌లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని ఎంఐఎం భావిస్తోంది. అయితే.. మిగతా స్థానాల్లో అన్ని బాగానే ఉన్నా.. చార్మినార్‌ స్థానంలో మాత్రం అహ్మద్‌ఖాన్‌ అడ్డం తిరిగారు. అయితే.. ఫైనల్‌ చేసేది.. ఓవైసీ బ్రదర్స్‌ కావడంతో.. వారు ప్రకటన చేసే వరకు ఆశావహులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ పుడుతోంది. మొత్తంగా.. మార్పులు-చేర్పుల వ్యవహారంలో ఎంఐఎంకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. అహ్మద్‌ఖాన్‌ విషయంలో సీన్‌ రివర్స్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఎంఐఎం హైకమండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…