Telangana Election: శేరిలింగంపల్లి నుంచి రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి నుంచి ఎన్‌.రామచంద్రరావుకు అవకాశం

|

Nov 10, 2023 | 10:03 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు సరిగ్గా కొన్ని గంటల ముందు భారతీయ జనతా పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ, తుది జాబితాలో 14 మంది పేర్లను ప్రకటించింది.

Telangana Election: శేరిలింగంపల్లి నుంచి రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి నుంచి ఎన్‌.రామచంద్రరావుకు అవకాశం
Telangana BJP
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు సరిగ్గా కొన్ని గంటల ముందు భారతీయ జనతా పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ, తుది జాబితాలో 14 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఎనిమిది స్థానాల్లో నామినేషన్లు వేయాల్సిందిగా అయా అభ్యర్థులకు ఢిల్లీ నుంచి గురువారమే నేరుగా ఫోన్ ద్వారా సమాచారం అందించింది.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన 8స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్లు వేయడానికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండటంతో, 8 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ గురువారం ప్రకాశ్ జావడేకర్ స్వయంగా ఫోన్ చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

ఐదోవ జాబితాలో పెద్దపల్లి నియోజక వర్గం నుంచి దుగ్యాల ప్రదీప్ కుమార్, మల్కాజిగిరి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎస్. రామచంద్ర రావును బరిలోకి దింపుతోంది బీజేపీ. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో గణేష్ నారాయణ్, నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్, దేవరకద్ర నుంచి కొండా ప్రశాంత్ రెడ్డి, నర్సంపేట నుంచి కె. పుల్లా రావులను నామినేషన్లను వేయాల్సిందిగా గురువారమే సూచించింది పార్టీ అధిష్టానం. ఇక తాజాగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి కోయల ఎమజీ, సంగారెడ్డి స్థానంలో డి.రాజేశ్వరరావు, వనపర్తి నుంచి అశ్వద్ధామ రెడ్డి పేర్లను ప్రకటించినా తుది జాబితాలో మార్చారు. వనపర్తి నుంచి అనుజ్ఞ రెడ్డి పేరు ఖారారు చేశారు. ఇక బెల్లంపల్లిలో సైతం గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చారు. అలంపూర్‌ స్థానం నుంచి మారెమ్మ, మధిర పెనుమల్లి విజయరాజు, మధిర స్థానం నుంచి పెరుమర్పల్లి విజయ రాజు పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం.

Bjp Final List

మరో వైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ క్రమంలో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు టెన్షన్‌‌కు తెర దించుతూ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. చివరి నిమిషంలో పేరు ప్రకటించడంతో వెంటనే నామినేషన్‌ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అభ్యర్థులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..