Telangana Elections: తెలంగాణకు 100 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు.. ఎన్నికల నాటికి మరింత ఫోర్స్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది కేంద్రాన్నికల సంఘం గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగే ఎటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు రెట్టింపు భద్రతను కేంద్రం కేటాయించింది.

Telangana Elections: తెలంగాణకు 100 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు.. ఎన్నికల నాటికి మరింత ఫోర్స్..!
Central Armed Police Forces

Edited By: Balaraju Goud

Updated on: Oct 24, 2023 | 8:30 AM

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సైతం రాష్ట్రానికి చేరుకున్నాయి. భద్రత దృష్ట్యా రాష్ట్ర పోలీసు సిబ్బందికి సహాయంగా ఇప్పటికే 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను ఈసీ కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 20 వేల మంది సిబ్బంది తెలంగాణకు చేరుకున్నాయి. ఇది తొలి విడత బలగాలు మాత్రమే.. త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి పలు నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతు నిర్వహించనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది కేంద్రాన్నికల సంఘం గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగే ఎటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు రెట్టింపు భద్రతను కేంద్రం కేటాయించింది.

ప్రస్తుతం 100 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నాయి. నామినేషన్లు ఎన్నికల సమయానికి మరికొన్ని బలగాలు రాష్ట్రానికి చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు. దాదాపుగా గతంతో పోలిస్తే రెట్టింపుగా 20,000 కేంద్ర బలగాలను తెలంగాణలో రంగంలోకి దింపుతుంది. ప్రస్తుతానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్,అస్సాం రైఫిల్స్ బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గాడ్స్ లు తెలంగాణకి చేరుకున్నారు. కేంద్ర బలగాలు మొత్తం కొన్ని ప్రాంతాల్లో స్వయంగా పోలింగ్ బూత్లను అధీనంలోకి తీసుకొని భద్రత చర్యలో పాల్గొంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా భద్రతా చర్యల్లో పాల్గొంటాయి.

ప్రస్తుతానికి వచ్చిన కేంద్ర బలగాలు ముందు ముందు రానున్న కేంద్ర బలగాలు భద్రతా పరమైనటువంటి చర్యలతో పాటుగా అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో దగ్గర కూడా శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. కీలకమైన ప్రాంతాల్లో తనిఖీల్లో పాల్గొంటారని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో సమస్య ఆత్మక ప్రాంతాలు అతి సమస్యాత్మక ప్రాంతాలలో అక్కడి ప్రజలకు ధైర్యాన్నిచ్చేలా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…