Telangana Election: ఎన్నికల వేళ ఒక్కసారిగా మారిన వాతావరణం.. వణికిపోతున్న రాజకీయ నాయకలు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడింది. ప్రజల వద్దకు పరుగులు పెడుతున్న నేతలకు తుఫాన్ ఎఫెక్ట్ గండంలా మారింది. వాతావరణంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులను వణుకు పుట్టిస్తున్నాయి. చల్లగాలికి చిరుజల్లులు తోడవడంతో నేతలు వర్షంలో తడుస్తూ, చలికి వణుకి పోతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Telangana Election: ఎన్నికల వేళ ఒక్కసారిగా మారిన వాతావరణం.. వణికిపోతున్న రాజకీయ నాయకలు.
Campaign In Rain

Edited By:

Updated on: Nov 24, 2023 | 4:06 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడింది. ప్రజల వద్దకు పరుగులు పెడుతున్న నేతలకు తుఫాన్ ఎఫెక్ట్ గండంలా మారింది. వాతావరణంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులను వణుకు పుట్టిస్తున్నాయి. చల్లగాలికి చిరుజల్లులు తోడవడంతో నేతలు వర్షంలో తడుస్తూ, చలికి వణుకి పోతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు సైతం వర్షంలో తడుస్తూనే ఓటు విలువ తెలియజేస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు..

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. చలి గాలితో పాటు చిరుజల్లులు కొన్నిచోట్ల ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. వాతావరణంలో సంభవించిన ఈ మార్పులు ఎన్నికల ప్రచారానికి ఆటకంగా మారింది. ప్రచార గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజల వద్దకు పరుగులు పెడుతున్న నాయకులు చలి ప్రభావంతో గజగజ వణికి పోతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి విపరీతమైన చలి గాలి వీస్తుంది. కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. అయినా అభ్యర్థులు ప్రచారంలో విరామం లేకుండా వర్షం లోనూ పరుగులు పెడుతున్నారు. వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అభ్యర్థుల వెంట పార్టీ కార్యకర్తలు కూడా చలికి వణుకుతూ వానలో తడుస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

అభ్యర్థుల ప్రచారానికే కాదు ఎన్నికలు సజావుగా నిర్వహిచేందుకు సిద్దమవుతున్న అధికార యంత్రాగానికి కూడా ఈ వాతావరణం ఆటంకంగా మారింది. ఓటు విలువ తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఈసీ ఆదేశాలతో వర్షంలో శ్రమిస్తున్నారు స్థానిక అధికారులు. ఈ క్రమంలోనే ఓటు విలువ తెలియజేస్తూ వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ములుగు రోడ్ జంక్షన్, పోలిస్ హెడ్ క్వార్టర్స్ జంక్షన్ లో ఫ్లాష్ మాబ్ షో నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు విలువ వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…