Telugu News Telangana Telangana Assembly Budget session 2024 live updates Finance minister Bhatti Vikramarka speech
Telangana Budget 2024: గుడ్ న్యూస్.. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ, రూ.500లకు గ్యాస్ సిలిండర్..
Telangana Budget 2024 session Highlights: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
Telangana Budget 2024
Telangana Budget 2024 session Highlights: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు.. మంత్రివర్గ సమావేశం జరిగింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరు గ్యారంటీలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతతోపాటు.. అన్ని విషయాలు బడ్జెట్‌లో ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
6 గ్యారంటీల అమలు.. పార్లమెంట్ ఎలక్షన్స్.. దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందంటుని అధికార పార్టీ కాంగ్రెస్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలను రూపొందించింది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్‌కు అధిక నిధులు కేటాయించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..
ఇదిలాఉంటే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ రాక కోసం బీఆర్‌ఎస్ ఎల్పీ ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీ సమవేశాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.
లైవ్ వీడియో చూడండి..
LIVE NEWS & UPDATES
The liveblog has ended.
10 Feb 2024 01:26 PM (IST)
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
10 Feb 2024 01:15 PM (IST)
రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం
ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తాం
గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
10 Feb 2024 01:03 PM (IST)
వాస్తవాలకు దూరంగా గత బడ్జెట్
వాస్తవాలకు దూరంగా గత బడ్జెట్ ఉందని.. దుబారా ఖర్చులను తగ్గించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి హామీని అమలు చేస్తామన్న ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
10 Feb 2024 12:55 PM (IST)
ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే..
‘ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
ఇళ్ల కోసం వచ్చినవి 14,951
దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
10 Feb 2024 12:36 PM (IST)
విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు
విద్యా రంగానికి 21389కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
వైద్య రంగానికి 11500 కోట్లు
విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.
విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు
10 Feb 2024 12:36 PM (IST)
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు
ఎస్సి సంక్షేమం 21874 కోట్లు
ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు
మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
10 Feb 2024 12:29 PM (IST)
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా
పరిశ్రమల శాఖ 2543 కోట్లు
ఐటి శాఖకు 774కోట్లు.
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
పురపాలక శాఖకు 11692 కోట్లు
మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
వ్యవసాయ శాఖ 19746 కోట్లు
10 Feb 2024 12:28 PM (IST)
2023-24కి సవరించిన అంచనాలు.. ఇలా..
2023-24కి సవరించిన అంచనాలు
సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,69,141 కోట్లు
మూలధన వ్యయం రూ.24,178 కోట్లు
రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు
ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు
10 Feb 2024 12:20 PM (IST)
ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు..
మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు .. అంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను రూపొందించామన్నారు.
10 Feb 2024 12:16 PM (IST)
తెలంగాణ 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇదే..
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్
2024-25 అంచనా వ్యయం రూ.2,75,891 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు
10 Feb 2024 12:12 PM (IST)
తెలంగాణ త్యాగమూర్తుల ఆశయసాధన కోసం మా కార్యాచరణ
భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
తెలంగాణ త్యాగమూర్తుల ఆశయసాధన కోసం మా కార్యాచరణ
అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తున్నాం
ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం చుట్టాం
గుణాత్మక మార్పు తీసుకురావాలనేది మా కృతనిశ్చయం
10 Feb 2024 12:11 PM (IST)
బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క
తెలంగాణ ఓట్ ఆన్ బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు.. లైవ్ లో వీక్షించడండి..
రూ.3లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రేవంత్ ప్రభుత్వం రూపొందించింది. సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యతతోపాటు.. విద్య, వైద్యం, వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..
10 Feb 2024 11:34 AM (IST)
అన్ని వర్గాలకు మేలు జరిగేలా..
మధ్యాహ్నం 12గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలి బడ్జెట్ కావడంతో ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ గుడిలో పూజలు చేశారు. బడ్జెట్ పేపర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అసెంబ్లీకి బయల్దేరారు. కాగా.. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందంటున్న అధికార పార్టీ ప్రకటించింది.
10 Feb 2024 11:32 AM (IST)
అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్
కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు.. కేసీఆర్ రాక కోసం బీఆర్‌ఎస్ ఎల్పీ ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీ సమవేశాల్లో పాల్గొంటున్నారు. ఈనెల ఒకటో తేదీన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.