Rythu bandhu : వ్యవసాయానికి అందుకే కేసీఆర్ అంతగా ఊతమిస్తున్నారు.. 4 రోజులలో రైతుబంధు కింద రూ. 4,095.77 కోట్లు జమ : మంత్రి

|

Jun 17, 2021 | 9:05 PM

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ మూడు రోజుల నుంచి జోరుగా కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 42.43 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేయగా, రేపు మరో 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో..

Rythu bandhu : వ్యవసాయానికి అందుకే కేసీఆర్ అంతగా ఊతమిస్తున్నారు..  4 రోజులలో రైతుబంధు కింద రూ. 4,095.77 కోట్లు జమ : మంత్రి
Rythu bandhu money
Follow us on

Agriculture minister Singireddy Niranjan Reddy : తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ మూడు రోజుల నుంచి జోరుగా కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 42.43 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేయగా, రేపు మరో 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో సొమ్ములు జమ కానున్నాయి. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద మొత్తంగా 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో, రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ చేశారు. నాలుగో రోజూ నల్లగొండకే అత్యధికంగా 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు చెల్లించారు. రైతుబంధు పథకం కింద తెలంగాణలో అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు మాత్రమే జమచేశారు.

కాగా, మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో రూ.4095.77 కోట్లు జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కరోనా విపత్తులోనూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమే అని చెప్పారు. వ్యవసాయ రంగం వల్ల 60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగానికి చేయూత నిస్తున్నారని మంత్రి చెప్పారు.

రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. అందుకే కరోనా విపత్తులోనూ గత వానాకాలం, మొన్న యాసంగిలో కలిపి రూ. 14656.02 కోట్లు , ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. రైతుబంధు, ఉచితకరంటు , రైతుభీమా పథకాలతో తెలంగాణలో సాగు దశ – దిశ మారిందన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.

Read also : Sajjala fire on Babu: రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్