Telangana: పదో తరగతి హాల్‌ టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోన్న విద్యార్థులకు అలర్ట్‌. త్వరలోనే జరగనున్న పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్స్‌ను అధికారులు విడుదల చేశారు. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 18వ తేదీన మొదలై ఏప్రిల్‌ 2వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి...

Telangana: పదో తరగతి హాల్‌ టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Ts 10th Exams

Updated on: Mar 07, 2024 | 5:23 PM

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోన్న విద్యార్థులకు అలర్ట్‌. త్వరలోనే జరగనున్న పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్స్‌ను అధికారులు విడుదల చేశారు. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 18వ తేదీన మొదలై ఏప్రిల్‌ 2వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి.

హాల్‌ టికెట్ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

* ఇందుకోసం ముందుగా https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

* అనంతం పేజీలో కనిపించే ఎస్‌ఎస్‌సీ ఎగ్జామినేషన్‌ మార్చ్‌-2024 అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్ చేయాలి.

* వెంటనే మీ హాల్‌టికెట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ప్రింట్‌ తీసుకుంటే సరిపోతుంతుంది.

* ఇదిలా ఉంటే ఇప్పటికే పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను పంపించారు. ఆన్‌లైన్‌లో మాత్రం గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

* మార్చి 18వ తేదీ – ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌

* మార్చి 19వ తేదీ – సెకండ్‌ ల్యాంగ్వేజ్‌

* మార్చి 21వ తేదీ – థార్డ్ ల్యాంగ్వేజ్‌

* మార్చి 23వ తేదీ – మ్యాథమెటిక్స్‌

* మార్చి 26వ తేదీ – ఫిజికల్‌ సైన్స్‌

* మార్చి 28వ తేదీ – బయోలాజికల్‌ సైన్స్‌

* మార్చి 30వ తేదీ – సోషల్‌ స్టడీస్‌

* ఏప్రిల్‌ 1వ తేదీ – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1/ ఎస్సెస్సీ ఓకెషనల్‌ కోర్స్‌ (థియరీ)

* ఏప్రిల్‌ 2వ తేదీ – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్‌)

ఇదిలా ఉంటే ఈసారి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మాల్ ప్రాక్టీస్ విషయంలో, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకి ఇటీవల పరీక్షల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని… ఎలాంటి లోపాలు ఉండవద్దని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..