యావత్ దేశం, ఆ మాటకొస్తే యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. జాబిలిపై ఉన్న గుట్టును ప్రపంచానికి చెప్పేందుకు పయనమైన చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం మూన్‌పై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని ప్రజలంతా లైవ్‌లో వీక్షించేందుకు వీలుగా ఇప్పటికే నాసా లైవ్ స్ట్రీమింగ్ కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో బుధవారం స్కూళ్లు సాయంత్రం 6.30 గంటలకు పనిచేయనున్నాయి. ఈ విషయమై తెలంగాణ విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. లైవ్ స్ట్రీమింగ్ కోసం అన్ని స్కూళ్లలో ప్రత్యేక ఏర్పా్ట్లు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు చంద్రయాన్ ల్యాండింగ్‌కు సంబంధించి లైవ్ వీడియోను స్కూల్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లికించడానికి చేపట్టిన ఘట్టాన్ని విద్యార్థులు వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు లైవ్ వీడియోను చూపించనున్నారు. ఇదిలా ఉంటే జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ పెట్టనుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Chandrayaan-3 Mission🚀
Witness the cosmic climax as #Chandrayaan3 is set to land on the moon on 23 August 2023, around 18:04 IST.@isro pic.twitter.com/ho0wHQj3kw
— PIB India (@PIB_India) August 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..