Chandrababu: చేరికలపై దృష్టి పెట్టండి.. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. పలు విషయాలపై దిశానిర్దేశం..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్‌టీఆర్ భవన్‌లో శనివారం తెలుగుదేశం సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, కో-ఆర్టినేటర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ కార్యక్రమాలు పలు అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు నాయకులతో చర్చించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేరికలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు, జాతీయ అధికార ప్రతినిధి నాన్నురి నర్సిరెడ్డి సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెంచే విధంగా అందరూ కష్టపడి పనిచేయాలని, సభత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సభ్యత్వ నమోదును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఐ-టీడీపీతో అనుసంధానం చేసుకోవాలని నాయకులను ఈ సందర్భంగా కోరారు.
పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో వీలైనంత వేగంగా, సాధ్యమైనంత వరకు ఎక్కువగా సభ్యత్వ కార్యక్రమాన్ని చేసుకుందామని తెలిపారు. “ఉదయం తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అంతే నిజమని” పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జులను శాలువా కప్పి బక్కని నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్హు, రాష్ట పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, అజ్మీరా రాజునాయక్, ఐ-టీడీపీ అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..