Telangana: అచ్చం ఒరిజినల్‌లానే ఉంటాయ్.. చెక్ చేయకుండా కొన్నారో.. ఖేల్ ఖతం

|

Nov 30, 2022 | 12:26 PM

మురిగిపోయిన అల్లం, వెల్లుల్లి తీసుకొస్తారు. దానికి మక్క పిండి, లెమన్‌ ఎల్లోతో కలిపి తక్కువ క్వాలిటీతో పేస్ట్‌ను తయారు చేసి అమ్ముతున్నారని పోలీసులు విచారణలో తేలింది.

Telangana: అచ్చం ఒరిజినల్‌లానే ఉంటాయ్.. చెక్ చేయకుండా కొన్నారో.. ఖేల్ ఖతం
Fake Ginger Garlic Paste
Follow us on

మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్.. బయట కొంటున్నారా.. డబ్బా మీద బ్రాండ్ స్టిక్కర్ ఉంది కదా అని ఒరిజినల్ అనుకుంటున్నారా.. అయితే మీరు బోల్తా పడ్డట్టే. ఇక్కడ చూడండి.. అల్లం వెల్లుల్లి నింపిన డబ్బాలు ఇవన్నీ.. మార్కెట్‌లో దొరికే డబ్బాలు కూడా సేమ్ టూ సేమ్ ఇలానే ఉన్నాయి. వాటి లాగే వీటి మీద బ్రాండ్ స్టిక్కర్ కూడా ఉంది. ఈ ప్యాకింగ్ స్టైల్ చూసిన వాళ్లు ఎవరైనా ఇది ఒరిజినల్ అల్లం వెల్లుల్లి పేస్టే అనుకోవడం గ్యారంటీ. కానీ ఇవి ఒరిజినల్ కాదు.. కల్తీ.

ఆలుగడ్డలు, మక్కపొడితో పాటు ఇతర రసాయనాలు కలిపి కల్తీ పేస్టును తయారుచేసి మార్కెట్లో పేరు మోసిన బ్రాండ్ స్టిక్కర్లు డబ్బాలపై అతికించి వాటిని యధేచ్ఛగా సేల్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇమ్రాన్ సలీం.. సయ్యద్ ఖలీమ్‌తో కలిసి తాండూరులోని పాత కూరగాయల మార్కెట్‌ దగ్గర ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే దందాకు తెరతీశారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఈ కల్తీ తయారీ కేంద్రంపై దాడి చేశారు. లక్ష రూపాయల విలువ చేసే 20 క్వింటాళ్ల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దందాలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు..? ఏయే ప్రాంతాల్లో విక్రయించారు అనే అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం