కాంగ్రెస్ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారడంపై యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని అన్నారు. అంతేకాదు తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు.స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈ విషయాలు వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని.. గతంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు.. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాట్లాడానని అన్నారు. అధిష్టానం తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో కార్యకర్తల కష్టనష్టాలను పట్టించుకునే వారే లేరని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కుంతియా, ఉత్తమ్‌ల సారథ్యంలో పార్టీ కోలుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు.