Suryapet: లోకల్‌గా ఫేమ్‌ కావాలనే బలుపు కూడా..! బంటి హత్య కేసులో కొత్త కోణాలు

తోడబుట్టినోళ్లా.. తోడేళ్లా? ..ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం తోడబుట్టిన చెల్లెల్నే చంపేశాడు ఒకడు. కులరక్కసితో చెల్లెలి కాపురంలో నిప్పులు పోశాడు మరొకడు. సూర్యాపేట పరువు హత్య కేసులో నిందితుడు నవీన్‌ క్రైమ్‌ రికార్డ్‌ సంచలనంగా మారింది. రౌడీ మార్క్‌ ఫేమ్‌తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే క్రిష్ణను చంపేశాడా? పరువున్మోదంతో పాటు మరిన్ని కోణాలు వెలుగుచూస్తున్నాయి.

Suryapet:  లోకల్‌గా ఫేమ్‌ కావాలనే బలుపు కూడా..! బంటి హత్య కేసులో కొత్త కోణాలు
Vadlakonda Krishna Alias Bunti

Updated on: Jan 31, 2025 | 7:21 PM

సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపిన క్రిష్ణ అలియాస్‌ బంటి హత్య కేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. పరువున్మోదంతో ఒక్కటే కాదు .. క్రిమినల్‌గా లోకల్‌గా ఫేమ్‌ కావాలనే బలుపు కోణం కూడా తెరపైకి వచ్చిందిప్పుడు. రౌడీ అన్పించుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే కుట్రతోనే తన సోదరులు నవీన్‌ వంశీ ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు భార్గవి. పక్కా పథకంతోనే క్రిష్ణను హత్య చేశారన్నారామె . క్రిష్ణను హత్య చేశాక నిందితులు డెడ్‌బాడీని కారులో పెట్టుకొని నానమ్మ బూచమ్మ దగ్గరకు తీసుకెళ్లారు. చంపేశామని చూపించారు. ఆమె కళ్లలో తృప్తి కోసమేనని సినిమాటిక్‌ డైలాగ్‌లు వదిలారు. శవాన్ని ఎక్కడో పడేసేవాళ్లే కానీ… తాము చంపామని ఊళ్లో తెలియాలి.. అందరు తమను చూసి భయపడాలి.. ఆ భయాన్నే అదనుగా చేసుకొని రాజకీయంగా ఎదగొచ్చని స్కెచ్చేశాడు నవీన్‌. భార్గవి మాత్రమే కాదు ప్రాథమిక దర్యాప్తులో పోలీసుల మాట కూడా అదే.

నిజానికి భార్గవి అన్న నవీన్‌తో వంశీకి స్నేహం వుంది. వంశీకి వున్న ఫ్రెండ్స్‌ నెట్‌ వర్క్‌ను చూసి తను కూడా అలా వుండాలని అనుకునేవాడట నవీన్‌. ఊళ్లో ఉత్సవాలైతే వంశీని తీసుకెళ్లేవాడట. కానీ స్నేహం కాస్తా రాను రాను దుష్మన్‌గా మారింది. తన చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకోవడంతో క్రిష్ణపై కక్ష కట్టాడు. సూర్యాపేటలో వుండే బైరి మహేష్‌తో కలిసి ప్లానేశాడు. మహేష్‌ ..క్రిష్ణలకు రియల్‌ ఎస్టేట్‌లో పరిచయం వుంది. ప్లాట్‌ పేరిట ట్రాప్‌ చేసి క్రిష్ణను హత్య చేశారనే మరో ట్విస్ట్‌ బయటకు వచ్చిందిప్పుడు.

ఇక కేసును మాఫీ చేసుకుంటే 2 కోట్లు.. కాదు కూడదంటే కృష్ణలాగే మిమ్మల్ని చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారన్నారు భార్గవి, క్రిష్ణ కుటుంబసభ్యులు. తమకు రక్షణ కల్పించాలన్నారు.

పరువోన్మాదం…క్రిమినల్స్‌గా ఫేమై పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వాలనే కుట్ర… రియల్‌ ఎస్టేట్‌ పేరిట ట్రాప్‌.. కేసు మాఫీ చేసుకోకపోతే హత్య చేస్తామనే బెదిరింపులు…ఈ సీక్వెల్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి