వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్.. ఇలా నిమజ్జనం చేస్తే రూ.10,116 బహుమతి!

వినాయక చవితి అంటే భక్తి.. భక్తి అంటే నియమం.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. కానీ కాలం మారుతున్న కొద్దీ కొన్ని చోట్ల వేడుకల తీరు కూడా మారుతోంది. వినాయక మండపాల దగ్గర సినిమా పాటలు.. నిమజ్జన ఊరేగింపుల్లో భారీ చప్పుళ్ళు.. మద్యం మత్తులో యువత హద్దులు దాటే నృత్యాలు.. ఇలా పండుగ అసలు స్ఫూర్తి పక్కదారి పట్టకుండా ఆధ్యాత్మికత నింపేందుకు ఒకరు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఇక్కటి నిర్వాహకులు. మరి వారు ఏం చేబోతున్నారో తెలుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్.. ఇలా నిమజ్జనం చేస్తే రూ.10,116 బహుమతి!
Alcohol Free Vinayaka Chavithi

Edited By:

Updated on: Sep 17, 2026 | 10:50 AM

వినాయక చవితి వేడుకల్లో సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను పెంచే లక్ష్యంతో సూర్యాపేటలో బిఆర్ఎస్ నేత వల్లాస్ జానీ ప్రశంసనీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్యం వద్దు.. మహాగణపతి భక్తి ముద్దు అనే నినాదంతో పండుగ ఆచారాలను కాపాడేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మద్యం వద్దు.. మహాగణపతి భక్తి ముద్దు” అనే నినాదంతో ముందుకొచ్చారు. సూర్యాపేటలోని రాజీవ్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో.. మద్యం సేవించకుండా.. నిష్ఠ, నియమాలతో పూజలు నిర్వహిస్తూ..భక్తిభావంతో వేడుకలు జరుపుతూ.. క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే మండపాలకు రూ.10,116 నగదు పురస్కారం అందిస్తామని ప్రకటించారు.

బహుమతి ఆఫర్ కాదు.. మార్పు కోసం..

భక్తితో వినాయకుడిని పూజిద్దాం.. క్రమశిక్షణతో నిమజ్జనం చేద్దాం.. మద్యం లేకుండా పండుగను ఘనంగా జరుపుకుందాం అనే ఆదర్శవంతమైన పిలుపు ఇవ్వడమే కాకుండా మన ఊరు మన కుటుంబం అనే భావనతో పర్యావరణాన్ని కాపాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని బాధ్యతాయుతంగా సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్పుకు ఇది ఆరంభం కావాలి.. భక్తి అనేది ప్రదర్శన కాదు అదొక ఆంతరంగిక క్రమశిక్షణ మాత్రమేనని.. పండుగల పేరుతో మద్యం సేవించడం శబ్ద కాలుష్యానికి పాల్పడటం యువతను తప్పుదోవ పట్టిస్తోందని జానీ చెబుతున్నారు. ఈ నిర్ణయం కేవలం ఒక బహుమతి ఆఫర్ మాత్రమే కాదు అది యువతలో బాధ్యతను సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పెంపొందించే ఒక గొప్ప సామాజిక సంస్కరణగా భావిస్తున్నానని అంటున్నారు.

వినాయక చవితి ఉత్సవాల్లో సంస్కృతి సాంప్రదాయాలతో ఆధ్యాత్మిక భావనను పెంచే ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను మిగతా గ్రామాలు, పట్టణాల్లోని ఉత్సవ కమిటీలు, నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. నిమజ్జనోత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేటలో మొదలైన ఈ ఆలోచన.. మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తే పండుగల నిర్వహణలో కొత్త ఒరవడి ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us