Heat wave In Hyderabad: భాగ్యనగర వాసులు భానుడి భగభగలతో అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా ఎండలు మండిపోతుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో గరిష్టంగా బుధవారం మాదాపూర్‌లో (Madhapur) అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత. బాలాజీనగర్, మైత్రీవనంలో, తిరుమలగిరి, అడ్డగుట్టలో 41.3, మౌలాలిలో 41.1, ప్రశాంత్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, జుమ్మెరాత్ బజార్‌లో 40.9, మచ్చబొల్లారం, అల్కాపురి కామన్‌హాల్‌లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత(Summer Heat) మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతుండడంతో జనం బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు.
ఈ సీజన్‌లో ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే హైదరాబాద్‌లో మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదైందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఇప్పటివరకు భారీ వర్షాలు లేవు. కానీ నగరం అంతటా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మరోవైపు, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) దాదాపు అన్ని జిల్లాలలో వేడిగాలుల వీస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ , మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారే చేసింది.
హీట్‌వేవ్ అంటే ఏమిటి?
హీట్ వేవ్ అంటే సాధారణ ఉష్ణోగ్రతలకంటే వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రతలు. ఇవి అధికమైనప్పుడు ప్రాణాంతకంగా మారతాయి. కొన్ని దేశాలలో హీట్ వేవ్ ను ఉష్ణోగ్రత , తేమ లేదా ఉష్ణోగ్రతల తీవ్ర ఆధారంగా ఉష్ణ సూచిక ద్వారా కొలుస్తారు. ఒక ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత మైదానాలకు 40 డిగ్రీల సెల్సియస్, కొండ ప్రాంతాలకు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు హీట్ వేవ్ గా పరిగణించబడుతుంది.
ముందు జాగ్రత్తలు:
హీట్ వేవ్ .. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్‌తో సహా తీవ్రమైన ఆరోగ్యాలను కలిగిస్తాయి. హీట్ వేవ్ బారినపడకుండా ఉండాలంటే.. తగినంత నీరు త్రాగండి. పరిసరాలను చల్లగా ఉంచండి. వదులుగా ఉండే దుస్తులు ధరించండి. కెఫిన్ ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. ఎండలో వెళ్లాల్సి వస్తే.. ఎమర్జెన్సీ కిట్‌గా వాటర్ బాటిల్, గొడుగు, గ్లూకోజ్ వంటివి తీసుకుని వెళ్ళండి.
Also Read: Tirupati: వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి?.. ఎటువంటి సమస్యలకు ముడుపులు కడతారంటే..
AP CM Jagan: సీఎం పర్యటన.. అధికారుల అత్యుత్సాహం.. అద్దె కారులో తిరుపతి వెళ్తున్న ఫ్యామిలీకి తీవ్ర ఇబ్బందులు