Summer Holidays: కాలేజీల‌కు వేసవి సెలవులు ఇవే.. కానీ వారికి మాత్రం

|

Apr 02, 2023 | 3:55 PM

ఓ వైపు ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన తెలంగాణ విద్యార్థులు రిలాక్స్​ అవుతున్నారు. మరోవైపు ఈ సారి ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నామని బోర్డు అధికారులు తెలిపారు.

Summer Holidays: కాలేజీల‌కు వేసవి సెలవులు ఇవే.. కానీ వారికి మాత్రం
Telangana Inter Students
Follow us on

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్టియర్ వాళ్లకు మార్చి 15 నుంచి.. సెకండియర్ వాళ్లకు మార్చి 16 నుంచి స్టార్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రథమ సంవత్సరం వాళ్లకు మార్చి 28న, ద్వితీయ సంవత్సరం వాళ్లకు మార్చి 29న ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో  ఇన్ని రోజులు చదువల్లో తలమునకలైనవారు.. ఇప్పుడు కాస్త ఊపరి పీల్చుకుంటున్నారు. అంటే ఇంటర్ స్టూడెంట్స్‌కు హాలిడేస్ ప్రారంభమయినట్లు లెక్క. కాగా తిరిగి జూన్ ఫస్ట్‌న ఇంటర్ క్లాసులు ప్రారంభించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ లెక్కన ఏప్రిల్, మే.. నెలలు మొత్తం సెలవుల కిందే లెక్క. అయితే ఇంట‌ర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం.. ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు సన్నమవుతున్న క్రమంలో మళ్లీ పుస్తకాలు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది ఇంట‌ర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపు 9,48,010 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై ఫోకస్ పెట్టింది. గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు స్టార్ట్ చేశారు. వాల్యుయేషన్, టేబులేషన్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే..  మే మొదటి వారంలో ఇంట‌ర్ రిజల్ట్స్ వెల్లడించే చాన్స్ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..