Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏకంగా 2 నెలలు వేసవి సెలవులు

ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సమ్మర్ సెలవులు షురూ అయ్యాయి. నేటి నుంచి వాళ్లకు వేసవి సెలవులు మొదయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు ఇంటర్ స్టూడెంట్స్‌కు సెలవులు రానున్నాయి. ఇంటర్మీడియట్‌ కాలేజీలకు జూన్ 1 వరకు ఈ సెలవులు కొనసాగుతాయి.

Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏకంగా 2 నెలలు వేసవి సెలవులు
Inter Students

Updated on: Mar 30, 2025 | 2:30 PM

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు  గుడ్ న్యూస్. ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు మార్చి 30 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అయ్యాయి. ఈనెల 25వ తేదీతో ఇంటర్‌ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు 2024-25 అకడమిక్ సంవత్సరానికి శనివారమే చివరి వర్కింగ్ డే. అంటే మార్చి 30 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. తిరిగి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జూన్‌ 2న కాలేజీలు రీ ఓపెన్ అవుతాయి. ఇంటర్‌బోర్డు రూల్స్ ప్రకారం వేసవి సెలవుల్లో ఇంటర్‌ క్లాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదు. ఎవరైనా క్లాసులు అనధికారికంగా నిర్వహిస్తే ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుంది.  విద్యార్థులు హాయిగా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ 2025 ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరిగాయి. ఇక ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది.  స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను 17 నుంచి 19 కు పెంచారు. జవాబు పత్రాలను దిద్దేందుకు 14,000 మందిని నియమించారు. ఏప్రిల్ చివర్లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.