కరోనా కారణంగా విద్యార్థులు.. నష్టపోతున్నారని ఆలోచించిన ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఫ్లాన్ చేశాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అల్లాపూర్‌కు చెందిన లక్ష్మణ్.. విద్యార్థులెవరూ పాఠాలు మిస్ కాకూడదనుకున్నాడు. కరోనాతో పాఠశాలలన్నీ మూతపడ్డాయి.. దీంతో విద్యార్థుల భవిష్యత్తు వెనుకబడి పోతుందని బాధతో టీవీలు, సెల్ ఫోన్ సౌకర్యం లేని పాఠశాలలో బోధించడానికి ముందుకు వచ్చారు ఈ టీచర్.
అల్లాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులు చదువతున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు గానీ, టీవీలు గానీ లేవు. దీంతో చాలామంది ఆన్‌లైన్ క్లాస్‌లు వినలేకపోతున్నారు. ఇందుకు పరిష్కారం ఆలోచించిన టీచర్.. సొంత డబ్బులు రూ. 15 వేల రూపాయలతో మైక్ సెట్ కొని దాన్ని పాఠశాలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఆన్‌లైన్ క్లాస్ వచ్చే టైంకి తన ఫోన్ ఆన్ చేసి ఆ మైక్ సెట్ వద్ద పెడతారు. దీంతో గ్రామంలోని ప్రతి విద్యార్థికి క్లాన్ వినిపిస్తోంది.
గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆన్ లైన్ క్లాస్ వినాలని తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు లక్ష్మణ్. కొంత మంది పిల్లలకు ఫోన్, టీవీ అందుబాటులో లేని కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు వినడం లేదు. అందుకే ఈ ప్రయత్నం చేశానని అంటున్నారు. 2018లో ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే లక్ష్మణ్ చొరవ కారణంగా ఆ సంఖ్య ఇప్పుడు 62కు చేరింది. ఎలాంటి సౌకర్యాలు లేని పాఠశాలలో గ్రామ సర్పంచ్, ప్రజల సహకారంతో బండలు, పెయింటింగ్ వేయించి, చెట్లు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ఇక్కడకు పంపేలా స్కూల్‌ను తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు సైతం ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి ఉత్సాహం చూపుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :నాగిని స్టెప్పులతో అదరగొట్టిన ఖాకీలు వంతపాడిన అధికారులు వైరల్ అవుతున్న వీడియో..:Cops dance inside police station video.