Panjagutta Police: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మహమూద్ అలీ మనవడు ర్యాగింగ్ చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. హోంమంత్రి అలీ మనవడు ఫర్హాన్ బంజారాహిల్స్ రోడ్ నం.3 లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఫరాన్ తమను ర్యాగింగ్ చేస్తున్నాడంటూ అదే కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థి రియాన్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సాయంత్రం తనపై దాడి చేశాడని.. అతనిపై చర్యలు తీసుకఉని తనను కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా తన చేతికి అయిన గాయాలను రియాన్ మీడియాకు చూపించాడు.
ఇదిలాఉంటే.. నిన్న సాయంత్రం కాలేజీలో జరిగిన గొడవపై హోంమంత్రి మనవడు ఫర్హాన్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన టీవీ9 తో మాట్లాడాడు. ఇద్దరు స్టూడెంట్స్ ఓ అమ్మాయితో మిస్ బిహేవ్ చేశారని.. అడ్డుకోబోతే.. తన పట్ల దురుసుగా వ్యవహరించాడన్నాడు. ఇద్దరి మధ్య వాదన పెరగడంతో కాలేజ్ యాజమాన్యం కలగచేసుకుందని.. సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత దురుసుగా ప్రవర్తించిన వారిని మందలించారని పేర్కొన్నాడు. ఆ కోపంతో తనపై ఫిర్యాదు చేశాడని.. తాను ఎవ్వరినీ ర్యాగింగ్ చేయలేదని.. చేయి చేసుకోలేదని తెలిపాడు. తన తాత హోంమంత్రి అని ఎక్కడ కూడా మిస్‌యూజ్ చేయలేదన్నాడు. తన తప్పుంటే దేనికైనా సిద్ధమంటూ పేర్కొన్నాడు. చిన్న గొడవను ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పెద్దగా చేస్తున్నారంటూ ఆరోపించాడు. గొడవలు పెట్టుకునే సంస్కృతి తమది కాదని వివరించాడు.
Also Read: