Telangana: బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చిన స్టూడెంట్.. బాలికల వాష్‌రూమ్‌కి వెళ్లి..

|

Jan 04, 2025 | 3:51 PM

మహబూబ్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో బాలికల వాష్‌రూమ్‌లో ఓ మొబైల్ కనిపించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. వాష్‌రూమ్‌లో మొబైల్‌తొ వీడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం అందుతోంది. దీంతో కాలేజ్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీలో పోలీసుల తనిఖీలు చేసి.. మొబైల్ పెట్టింది ఎవరో ప్రాథమికంగా తేల్చారు.

Telangana: బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చిన స్టూడెంట్.. బాలికల వాష్‌రూమ్‌కి వెళ్లి..
Polytechnic College
Follow us on

స్కూల్స్‌, కాలేజీల్లో కంత్రీగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకునే చోట గలీజ్‌ పనులకు తెగబడుతూ దుర్మార్గులుగా మారుతున్నారు. మేడ్చల్‌ సీఎంఆర్ కాలేజ్‌ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి కలకలం రేపుతోంది. ఎస్‌.. మహబూబ్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలోని బాలికల వాష్‌రూమ్‌లో మొబైల్స్‌తో వీడియో రికార్డింగ్‌ చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. వాష్‌రూమ్‌లో మొబైల్‌ను గుర్తించిన విద్యార్థినులు.. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

విద్యార్థి సంఘాలు పెద్దయెత్తున చేరుకుని మహబూబ్‌నగర్‌ కాలేజ్‌ ముందు బైఠాయించడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇక.. పాలిటెక్నిక్‌ కాలేజీలో తనిఖీలు చేసిన పోలీసులు.. గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో మొబైల్ పెట్టిన విద్యార్థిని సిద్ధార్థ్‌గా గుర్తించారు. బ్యాక్‌లాగ్‌ పరీక్ష రాసేందుకు వచ్చి వాష్‌రూమ్‌లో మొబైల్ పెట్టినట్లు తేల్చారు.

మేడ్చల్ CMR కాలేజ్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది…

హాస్టల్‌లో పనిచేస్తున్న కొంతమంది మేల్‌వర్కర్స్‌.. బాత్‌రూమ్ వీడియోలను రికార్డు చేశారన్నది విద్యార్థినుల ఆరోపణ. బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై ఉన్న చేతి గుర్తులే అందుకు సాక్ష్యమంటున్నారు. ఈ వ్యవహారం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..విద్యార్థులు. ఎలాంటి పొరపాటు జరగకపోతే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు చెరిపేశారని ప్రశ్నిస్తున్నారు. 12 మంది వర్కర్ల ఫింగర్ ప్రింట్స్‌ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్‌లోని తమ రూమ్‌లలో కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమోనని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి సంబంధించిన వారితో కాకుండా బయట వ్యక్తులతో తమ రూమ్స్‌ను చెక్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థినుల ఆందోళనలతో CMR క్యాంపస్‌ను పరిశీలించారు..కండ్లకోయ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి. ఘటనలో మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించిన పోలీసులు.. ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుండి ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే వెంటలేటర్‌పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ నిర్ధారించేందుకు కూడా టీమ్స్‌ను రంగంలోకి దించారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన వార్డెన్‌ ప్రీతిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..ఆమెను క్యాంపస్‌ నుంచి రహస్యంగా తరలించిన క్యాంటీన్‌ ఇన్‌ఛార్జ్‌ సెల్వన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించింది..తెలంగాణ మహిళా కమిషన్‌. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఉమెన్ కమీషన్‌..వ్యవహారంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్‌ సీపీని ఆదేశించింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో..హాస్టల్‌ను పరిశీలించారు కమిషన్ సభ్యురాలు పద్మజా రమణ. విద్యార్థులను అడిగి వివరాలు సేకరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..