
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రైన్ సర్వీసులను నడుతున్న దక్షిణ మధ్య రైల్వే.. శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ – కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయని గురువారం తెలిపింది. ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లం స్టేషన్‌కు (07109) బయల్దేరనుంది. కొల్లాం నుంచి సికింద్రాబాద్ (07110) కు డిసెంబర్ 19న స్పెషల్ రైలు బయల్దేరుతుందని పేర్కొంది. ఈ స్పెషల్ ట్రైన్‌కు రిజర్వేషన్ల ప్రక్రియ (డిసెంబర్ 10న) శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభవుతుందని వెల్లడించింది.
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్‌చెరి, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.
#SabarimalaSpecialTrains between Secunderabad – Kollam – Secunderabad (via Kazipet, Gudur, Renigunta) @drmsecunderabad @drmhyb pic.twitter.com/aPwcVXe4dH
— South Central Railway (@SCRailwayIndia) December 9, 2021
Extension of Vasco-Da-Gama – Jasidih Weekly Express Trains pic.twitter.com/gTQiuobNLy
— South Central Railway (@SCRailwayIndia) December 9, 2021