హైదరాబాద్, జూలై 27: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఈ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థపై పడింది. హసన్‌పర్తి – కాజీపేట రైల్వే ట్రాక్‌పై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. వర్షాల కారణంగా రైళ్ల రద్దు వివరాలను అప్‌డేట్ చేసింది దక్షిణ మధ్య రైల్వే . ఇప్పటికే మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా క్యాన్సల్ చేసింది. వీటితోపాటు 9 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. ఇందులో సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17233)తోపాటు సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234) రైళ్లను క్యాన్సల్ చేసినట్లుగా తెలిపింది.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాలో తిరుపతి – కరీంనగర్ (12761), కరీంనగర్ – తిరుపతి (12762), సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. వర్షాలు ఇలానే మరో రెండు రోజులు కొనసాగితే మరిన్ని రైళ్లు రద్దు చేసే అవకాశం ఉంది.
దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అటు.. నార్త్.. ఇటు సౌత్ అన్ని రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే మాత్రం అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవడం.. రైల్వే అధికారులు అందించే సమాచారం తెలుసుకుంటూ ఉండటం చాలా అవసరం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం