Hyd Railway Passenger Alert: తాత్కాలికంగా పలు ఎంఎంటీస్‌ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

|

Nov 22, 2021 | 8:57 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లోని రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి

Hyd Railway Passenger Alert:  తాత్కాలికంగా పలు ఎంఎంటీస్‌ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లోని రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. మరికొన్ని దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సాంకేతిక కారణాలతో 22, 23 తేదీల్లో జంటనగరాల్లో తిరుగుతున్న పలు ఎంఎంటీస్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి, సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా, హైదరాబాద్‌ స్టేషన్ల మధ్య తిరిగే 24 రైళ్లను నిలిపి వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్‌ రిలేషన్స్ ఆఫీసర్‌ (సీపీఆర్వో) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జంటనగరాల్లోని రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.

కాగా కరోనా కారణంగా గతేడాది మార్చిలో దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుమారు ఏడాది తర్వాత ఈ ఏడాది జూన్‌లో ఈ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ శివార్లలో నివసించే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ఇవి చౌకైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందజేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటున్నాయి.

TSRTC: ఇక నుంచి బస్సులపై ప్రకటనలు కనిపించవు.. రూ. 20 కోట్ల ఆదాయాన్ని సైతం వదులుకొని ఆర్టీసీ నిర్ణయం..

Smuggling Airport: హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్‌.. బంగారం, విదేశీ కరెన్సీతో పాటు ఐఫోన్‌ల స్వాధీనం..

Civils Free Coaching: సివిల్స్ 2022 పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత కోచింగ్.. దరఖాస్తు తేదీ పొడిగింపు