TRS MLAs Poaching Case: చంచల్‌గూడ జైలు నుంచి సింహయాజి విడుదల.. బెయిల్‌ వచ్చిన వారం తర్వాత..

|

Dec 07, 2022 | 9:52 AM

చంచల్‌గూడ జైలు నుంచి సింహయాజి విడుదలయ్యారు. ఫామ్‌హౌస్‌ కేసులో నిందితుడుగా ఉన్న సింహయాజి ఇవాళ బయటకు వచ్చారు. బెయిల్‌ వచ్చిన వారం తర్వాత విడుదలయ్యారు సింహయాజి.

TRS MLAs Poaching Case: చంచల్‌గూడ జైలు నుంచి సింహయాజి విడుదల..  బెయిల్‌ వచ్చిన వారం తర్వాత..
TRS MLAs Poaching Case
Follow us on

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి బెయిల్‌‌పై రిలీజయ్యారు. వాస్తవానికి ఆరు రోజుల క్రితమే ఆయనకు హైకోర్ట్‌ బెయిల్ ఇచ్చినప్పటికీ జామీను సమర్పించడంలో ఆలస్యం కారణంగా ఇన్ని రోజులు బయటకు రాలేదు. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో 6లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు సింహయాజీ తరఫు లాయర్. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ చేశారు అధికారులు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సింహయాజీ నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగానే.. కారులో ఎక్కేసి వెళ్లిపోయారు.

ఇదే కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌లకు కూడా హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, వీరిద్దరిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో వేర్వేరు కేసులు ఉండటంతో ఇద్దరూ చంచల్‌గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం