Telangana: పార్కు చేసిన ఓ స్కూటీలో కట్ల పాము.. తప్పిన ప్రాణాపాయం..
సమ్మర్ లో కంటే రైనీ సీజన్స్, వింటర్ లో నివాస పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. గార్డెన్ ఏరియా ఐసోలేటెడ్ మధ్య ఇండ్లు ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి ఇలా తరచు అంటారు. అందులోనూ ఇక చలికాలం కూడా త్వరగా చీకటి పడుతుంటుంటుంది వెలుతురు లేని ప్రాంతాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి.. అని కూడా అంటారు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు..
ఈ వార్త చదివితో ఓహ్ ఇదా మ్యాటర్ అనాల్సిందే.. సాధారణంగా ఇండ్లలోకి పాములు రావడం డ్రైనేజీలోకి రావడం చూస్తుంటాం.. కానీ విచిత్రంగా ఈమధ్య కాలం బయట పార్క్ చేసిన కార్లు బైకులు, హెల్మెట్లలో, షూ రాక్ లలో పాములు నివాసం ఏర్పాటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పార్కు చేసిన ఓస్కూటీలో కట్ల పాము ప్రత్యక్షమైంది. దీంతో వాహనదారుడు భయబ్రాంతులకు గురైయాడు. స్థానికుల సాయంతో బండిలోనుంచి పామును బయటకు తీశారు. దాదాపు గంట సేపు శ్రమించి స్కూటర్ముందు భాగాన్ని స్క్రూ డ్రైవర్ సాయంతో తీశారు. అయితే పాము ఎంతకీ బయటకు రాకపోవడంతో స్కూటర్ నుంచి పాముని బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సుమారు గంట పాటు శ్రమించి పామును స్కూటర్ నుంచి బయటకు తీసి చంపారు. ఈ పాము తాచు పాము కంటే ప్రమాదమైనదని.. దీనిని కట్లపాము అని స్థానికులు చెప్పారు.
ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. వాహనాలు పార్కు చేసే పరిసరాలను సైతం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని పార్క్ చేస్తే పాములు ఎలుకలు వంటివి వెళ్లకుండా ఉంటుందని అంటారు. వాహనంలోకి పాములు దూరితే వాహనం పాడవడమే కాదు.. ఆ సమయం మనుషులు పాముల జోలికి వెళ్తే.. అవి మనుషులను కాటు వేయడం కూడా జరుగుతుంది.
సాధారణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు పడతాయి. కాటు వేసిన ప్రాంతంలో వాపు, నొప్పి ఉంటుంది. అయితే కట్లపాము కాటేస్తే మాత్రం ఈ లక్షణాలు ఏమీ ఉండవు. అయితే కాటు వేసిన కొంతసేపటికి వాంతులు, కడుపునొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు మొదలవుతాయి. చికిత్స తీసుకోవడంలో ఆలస్యం అయితే నరాల బలహీనత, ఊపిరి అందకపోవడం జరిగి చివరికి ప్రాణాలను హరిస్తుంది.
మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..